YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

దుర్గగుడికేంద్రంగా జరిగే ప్రతి అవినీతిలో వెల్లంపల్లికి భాగముంది

దుర్గగుడికేంద్రంగా జరిగే ప్రతి అవినీతిలో వెల్లంపల్లికి భాగముంది

దుర్గగుడికేంద్రంగా జరిగే ప్రతి అవినీతిలో వెల్లంపల్లికి భాగముంది
చిరుద్యోగులను బలిచేసి, పెద్ద తిమింగలాన్ని వదిలేశారు
విజయవాడ
విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామిదేవస్థానం కేంద్రంగా తలెత్తిన వివాదాలు, అవినీతికార్యకలాపాలు, అవకతవకల తీరు చూస్తుంటే ముఖ్యమంత్రి నుంచి దేవాదాయమంత్రి, సదరు శాఖాధికారులవరకు అందరినీ అనుమానించాల్సివస్తోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దుర్మమ్మకు భక్తులు అనేకప్రాంతాల్లో ఆస్తులను కానుకలుగా సమర్పించారని, అవన్నీ నేడు ఏస్థితిలో, ఎవరి స్వాధీనాల్లో ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. కృష్ణాజిల్లాలో ని కంకిపాడు మండలం పునాదిపాడు సర్వేనంబర్ 284/1/2/4 లో ని దుర్గగుడి భూములు మురుగునీటి కుంటలుగా మారాయన్నా రు. అక్కడిభూములపక్కనే ఒకకార్పొరేట్ విద్యాసంస్థ ఉండటంతో దానినుంచి వచ్చే మురుగునీటితో దేవస్థానం భూములున్నీ నిండి పోయాయన్నారు. కార్పొరేట్ సంస్థ అధికమొత్తంలో కౌలు చెల్లిస్తుం టే, అందులోకొంతమొత్తమే దేవస్థానానికి చేరుతోందని ఆనంద్ సూర్య తెలిపారు. అలానే అదేజిల్లాలోని కవులూరులోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 29ఎకరాలను కొందరు సొంతం చేసుకునేప్రయత్నాల్లో ఉన్నారన్నారు. సర్వేనంబర్ 277లో ని 17ఎకరాలు, సర్వేనంబర్ 376లోని 23.60ఎకరాలు, సర్వేనంబ ర్ 460లోని 8.03ఎకరాలుభూములకు నామమాత్రపు కౌలుకూడా చెల్లించడంలేదన్నారు. ఆయాసర్వేనంబర్లలోని కొంతభూమి ఇప్ప టికే కొందరివ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందని ఆనంద్ సూర్య చెప్పారు. సంవత్సరానికి ఎకరానికి రూ.30వేలవరకు కౌలురావాల్సిఉంటే, దానిలో సగమే దేవస్థానానికిచెల్లిస్తున్నారన్నారు. రామవరప్పాడు, విజయవాడలోని విద్యాధరపురంపరిధిలోని భూములతో పాటు, అనేకప్రాంతాల్లోని ఎకరాలకొద్దీ మాగాణిభూములపై రావాల్సినంత ఆదాయం రావడంలేదన్నారు. దుర్గగుడి, దాని ఉపాలయాలకు ఉన్న ఆస్తులన్నింటినీఒకపద్ధతిప్రకారం, దోచుకునే ప్రక్రియ యథే చ్ఛగా సాగుతోందన్నారు. ఆలయభూములపై అజమాయిషీ చేసే ఈవోలే  (ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు) భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాధత్తంచేసి, ఆదాయానికి గండికొడుతున్నారని టీడీపీనేత స్పష్టంచేశారు. తక్షణమే ఈవోవ్యవస్థను రద్దుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొన్నిచోట్ల నిర్మాణాలపేరుతో టెండర్లను వారి బినామీలకు కట్టబెట్టి,  భవనాలు నిర్మించడం తిరిగి కూలగొట్టడం చేస్తున్నారన్నారు.  ఎందుకు నిర్మిస్తున్నారో, ఎందుకు కూల్చేస్తు న్నారో తెలియని పరిస్థితులున్నాయన్నారు. అమ్మవారికి సమ ర్పించే కానుకలు, బంగారుఆభరణాల లెక్కింపుసయమంలో కొందరు సిబ్బందిచేతివాటం చూపుతున్నారని, బంగారాన్ని కాగి తాల్లో చుట్టి బయటకు విసిరితే, అప్పటికే అక్కడవేచిఉండే వారి మనుషులు దాన్ని చేజిక్కించుకంటున్నారని ఆనంద్ సూర్య పేర్కొ న్నారు. కొత్తగా వచ్చేఈవోలు విచ్చలవిడిగా కోట్లాదిరూపాయలను వారిసొంతఖర్చులకు వినియోగిస్తున్నారన్నారు. 
 వీటన్నింటిపై దృష్టిసారించాల్సిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఏమీ పట్టించుకోవడం లేదన్నారు. దుర్గగుడిలో జరిగే పనులకు సంబం ధించి టెండర్లు వేసినవారు, టెండర్ తాలూకా సొమ్ముచెల్లించకుం డా, అధికారులను మభ్యపెట్టి తప్పించుకుంటున్నారన్నారు. ఆ విధంగా ఇప్పటివరకు దేవస్థానానికి చెందాల్సిన సొమ్ము రూ.25ల క్షల వరకు మాయమైందన్నారు. మరోటెండర్ తాలూకా సొమ్ము రూ.23లక్షలుకూడా దేవస్థానానికి జమకాలేదన్నారు. చివరకు పాలకమండలి సభ్యులవాహానాల్లో మద్యంతరలించే హీనస్థితికి చేరారన్నారు. 2005లో అమ్మవారి గర్భగుడి గోపురాన్ని బంగారు తాపడంచేస్తామనిచెప్పి, రాగికల్తీ జరిగిందనిచెప్పి, దాన్ని మధ్యలో నే వదిలేశారన్నారు. ఆవ్యవహారంలో రూ.లక్షలసొమ్ము వృథా అయిందన్నారు. ఘాట్ రోడ్డు విస్తరణను రూ.50కోట్లతో చేపట్టార ని, రిటైనింగ్ గోడల నిర్మాణంపేరుతో కూడా అందినకాడికి దోచుకు న్నారన్నారు. చివరకు వివాదాలకేంద్రంగా దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానాన్ని మార్చేశారన్నారు. చివరకుదర్శనం టిక్కెట్లు, అన్న ప్రసాదాలను కూడా అవినీతికి  వాడుకున్నారన్నారు.  ఈ విధంగా అనేకవ్యవహారాల్లో జరిగిన అవినీతిని ఏసీబీ గుర్తించడంజరిగిందని, కానీ పెద్దతిమింగలాలను  వదిలేసి, 13మంది చిరుద్యోగులపై చర్యలు తీసుకున్నారని ఆనంద్ సూర్య తెలిపారు. ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి హిందూవ్యతిరేకి కాబట్టే, హిందూ భక్తులమనోభావాలు దెబ్బతినేలా దుర్గగుడికేంద్రంగా జరిగే చర్యల ను ఆయన వదిలేస్తున్నాడన్నారు. అన్నదానం టిక్కెట్ల అమ్మకా లు, చీరలవిక్రయాల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు.  7 విభా గాల్లో 5గురు సూపరిండెంట్లు, ఇతరసిబ్బందిపైచర్యలు తీసుకున్నా రని, దానిపై పూర్తిస్థాయిలో ఇంకా విచారణ జరగాల్సి ఉందన్నారు. దుర్గగుడి కేంద్రంగా జరిగే అవినీతిలో ప్రధానపాత్రధారైన వెల్లంపల్లిని తక్షణమే దేవాదాయమంత్రి పదవినుంచి తొలగించాలని వేమూరి డిమాండ్ చేశారు. దేవాదాయవ్యవస్థను నడపడంలో వెల్లంపల్లి ఘోరంగా విఫలమయ్యాడని, కనకదుర్గమ్మ సన్నిధిలో వెండిసింహా లు మాయమైతే దానిపై చర్యలు తీసుకులేకపోయాడన్నారు. దేవా లయంలోని స్క్రాప్ మొదలు అన్నింటిలో కోట్లాదిరూపాయల సొమ్ముని వెల్లంపల్లి స్వాహాచేశాడన్నారు. అన్నికోణాల్లో వెల్లంపల్లి అవినీతి ప్రస్ఫుటమైందని, ఆయన టీడీపీ, బీజేపీవారిపై నిందలే యకుండా, తానుచేసిన అవినీతిని అంగీకరిస్తే మంచిదన్నారు. దుర్గమ్మకొండను వివాదాలకొండ మార్చిన ఘనత వెల్లంపల్లికే దక్కిందన్నారు. రూ.50కోట్లతో తలపెట్టిన ఘాట్ రోడ్డు విస్తరణపనులు, రూ.75 కోట్లతో నిర్మించాలనుకున్న మహామండపం పనులు ఏమయ్యాయ న్నారు. 2016లో కూల్చేసిన కొన్నికట్టడాలకు దేవస్థానం సొమ్ము రూ.56కోట్లను పరిహారంగాచెల్లించాల్సి వచ్చిందన్నారు. అమ్మవారి కి భక్తులనుంచి వచ్చేఆదాయమంతా అధికారులు, ఈవోలు, ఎండో మెంట్ సిబ్బంది స్వాహాచేస్తున్నారన్నారు. కౌలులీజుల్లో జరిగే అక్రమాలవ్యవహారంకూడా బయటపెట్టాలన్నారు. కేశఖండనశాల నిర్మించడం తిరిగి పడగొట్టడంతో దాదాపురూ.కోటి25లక్షలసొమ్ము దుర్వినియోగం అయిందన్నారు. కార్లపార్కింగ్ కోసం రూ.3కోట్లను దుబారాచేశారన్నారు. ఈవిధంగా దుర్గగుడి పాలకమండలి అడు గడుగునా దేవస్థానం సొమ్ముని దుర్వినియోగంచేస్తోందన్నారు. ఈ వ్యవహారాలన్నీ ఏసీబీ నివేదికలో ఉన్నాయని, ప్రభుత్వం తక్షణమే ఆ నివేదికను బహిర్గతంచేయాలని వేమూరి డిమాండ్ చేశారు. 

Related Posts