ప్రజల సమస్యలను ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తే స్పందించే మంత్రి కేటీఆర్
అధ్యాపకుల సమస్యలపై ఎందుకు స్పందించరు
హైదరాబాద్
నారాయణ,చైతన్య కళాశాలలో అధ్యాపకుల తొలగింపు,అక్రమ ఫీజుల వసూళ్లకు నిరసనగా తెలంగాణ అధ్యాపకుల, విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యా సంస్థలు బంద్ ను కొత్తపేట లోని నారాయణ, చైతన్య కళాశాలల ముందు నిర్వహించారు. అక్రమంగా తొలగించిన తెలంగాణ అధ్యాపకులను అందరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. కరోనా కాలపు పది నెలల పూర్తి వేతనాలు వెంటనే చెల్లించాలని అని. జీవో నెంబర్ 45,46 అతిక్రమిస్తున కార్పొరేట్,ప్రవేట్ కాలేజీల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. తెలంగాణ ప్రైవేట్,కార్పొరేట్ విద్య సంస్థలలో స్థానికులకు ఉద్యోగ అవకాశం ఇవ్వాలని అధ్యాపకులు డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలను ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తే స్పందించే మంత్రి కేటీఆర్ అధ్యాపకుల సమస్యలపై ఎన్నిసార్లు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించరు అని అధ్యాపకులు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వెంటనే ప్రవేట్ అధ్యాపకులను విధుల్లోకి తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ ను అధ్యాపకులు కోరారు. ప్రవేట్ అధ్యాపకులను ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నా నారాయణ,శ్రీచైతన్య కాలేజీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటూ అధ్యాపకులు మంత్రి కేటీఆర్ ని ప్రశ్నించారు. మా సమస్యలపై స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.