YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కాంగ్రెస్ గూటికి బీజేపీ నేతలు

కాంగ్రెస్ గూటికి బీజేపీ నేతలు

బెంగళూర్, మార్చి 4, 
రిని నచ్చని కొందరు బలమైన నేతలు బీజేపీ నుంచి వెళ్లిపోతారా? అన్న చర్చ కర్ణాటక రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. యడ్యూరప్ప వైఖరి ఏకపక్షంగా ఉండటం, అధినాయకత్వం పట్టించుకోకపోవడంపై ఇప్పటికీ దాదాపు ముప్ఫయి మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. వీరికి అధినాయకత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకుంటే కాంగ్రెస్ బాట పట్టే అవకాశముంది.ఇప్పటికే హోసకోటె ఎమ్మెల్యే శరత్ బచ్చే గౌడ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. శరత్ బచ్చే గౌడ తండ్రి నారాయణ గౌడ బీజేపీ ఎంపీ. కొంతకాలం జరిగిన హోసకోటె ఉప ఎన్నికల్లో శరత్ బచ్చేగౌడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస నుంచి వచ్చిన ఎంబీటీ నాగరాజుకు టిక్కెట్ ఇవ్వడంతో శరత్ బచ్చేగౌడ రెబల్ గా పోటీ చేసి గెలుపొందారు. కానీ యడ్యూరప్ప తన మీద ఓటమిపాలయిన ఎంబీటీ నాగరాజును మండలి సభ్యుడిగా చేసి మంత్రి పదవి ఇవ్వడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నారు.కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన దాదాపు 15 నియోజకవర్గాల్లో బీజేపీ నేతల పరిస్థితి ఇలానే ఉంది. వచ్చే ఎన్నికల్లో తమకు బీజేపీ నుంచి టిక్కెట్ దక్కదని భావించి వారంతా కాంగ్రెస్ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సమాయానికి వీరంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. యడ్యూరప్ప వ్యతిరేక వర్గమంతా అధిష్టానాన్ని మరోసారి కలిసే ఆలోచనలో ఉంది. యడ్యూరప్పకు కళ్లెం వేయకుంటే తామ దారి తాము చూసుకోక తప్పదన్న హెచ్చరికలను పంపే యోచనలో వారున్నారు.మరోవైపు యడ్యూరప్పకు అసమ్మతితో పాటు అసంతృప్తి నేతల నుంచి విమర్శలు ఇబ్బందిగా మారుతున్నాయి. అసంతృప్త నేత బసవగౌడ పాటిల్ యత్నాల్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర పై తీవ్ర ఆరోపణలు చేశారు. బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీకి విజయేంద్ర ఆర్థిక సాయం చేశారంటూ ఆయన చేసిన ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. బదిలీల్ల పెద్దయెత్తున అవినీతి సొమ్మును విజయేంద్ర వెనకేసుకున్నారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని యడ్యూరప్ప వర్గం అధిష్టానంపై వత్తిడి తీసుకు వస్తుంది. బసవగౌడ పాటిల్ పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే ఆయన కాంగ్రెస్ గూటికి వెళ్లడం ఖాయం. ఆయనతో పాటు మరికొందరు అదే బాటపడతారని పార్టీ కేంద్రనాయకత్వం మల్లగుల్లాలుపడుతుంది.

Related Posts