YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

భార్యను హింసించిన అధికారి...కేసీఆర్ సీరియస్

భార్యను హింసించిన అధికారి...కేసీఆర్ సీరియస్

మెదక్, మార్చి 4, 
మంచి ఉద్యోగం.. చక్కని భార్య.. సాఫీగా సాగిపోతున్న సంసారంలో నిప్పులు పోసుకున్నాడు ఓ అధికారి. భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. రక్తం వచ్చేలా తీవ్రంగా కొట్టి హింసించాడు. పంచాయితీ పోలీస్ స్టేషన్‌కి చేరింది. తన పలుకుబడి ఉపయోగించి పోలీసులనూ బెదిరించడంతో విషయం ఎమ్మెల్యేలు, అమాత్యులకు.. అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి వరకూ వెళ్లింది. ఇంకేముంది కేసీఆర్ సారు కన్నెర్ర జేయడంతో ఉద్యోగం ఊడింది. ఈ షాకింగ్ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది.సిద్దిపేటకు చెందిన ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ తన భార్యను దారుణంగా కొట్టి హింసించాడు. ఆమెకు ఒంటిపై గాయాలయ్యేలా చిత్రహింసలకు గురిచేశాడు. భర్త వేధింపులు భరించలేని భార్య సిద్దిపేట పోలీసులను ఆశ్రయించింది. అయితే సదరు ఆర్‌ఐ తన పలుకుబడిని ఉపయోగించుకుని పోలీసు అధికారులకు కూడా బెదిరించాడట. దీంతో విషయం ఉన్నతాధికారులు, నేతల దృష్టికి వెళ్లింది.మంత్రి హరీష్ రావు, కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కి తెలియడంతో విషయాన్ని సీఎంవో దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటెలిజెన్స్ సిబ్బందితో సమాచారం తెప్పించుకున్నారు. దానికితోడు అతని వ్యవహారశైలిపై గతంలోనూ పలువురు ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేయడంతో సీఎం కన్నెర్రజేశారు. అతని ఉద్యోగం ఊడిపోయింది.

Related Posts