YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

అందరి దృష్టి కర్నాటక వైపే

అందరి దృష్టి కర్నాటక వైపే
సార్వత్రిక ఎన్నికలను కర్ణాటక ఎలక్షన్లే ప్రభావితం చేస్తాయా?
ఆ రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతే... ఆ పార్టీ అడ్రస్ జాతీయ స్థాయిలో గల్లంతవుతుందా?
కులాలు , మతాలు కాకుండా ఏఏ అంశాలు కర్ణాటక రాజకీయాలను ప్రభావితం చేస్తాయి?
సిద్ధరామయ్య వ్యూహాల ముందు... అమత్ షా దిగదుడుపేనా? ఆ రాష్ట్రంలో కరెన్సీ వరద పారిస్తున్నదెవరు? బీజేపీపై తమిళుల అభిప్రాయం ఎలా ఉంది? వారెన్ని స్థానాల్లో ప్రభావితంచేయగలరు?
కర్ణాటకలో ఎన్నికల వేడి తారా స్థాయికి వెళ్లింది...
రెండు జాతీయ పార్టీలు... నువ్వా - నేనా అన్నట్లు పోరాడుతున్నాయి.
చావో రేవో తేల్చేస్తామంటున్నాయి. అసలు ఒక దక్షిణాది రాష్ట్రానికి ఎందుకంత ప్రాధాన్యతనిస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే ఏమవుతుంది?
 
గ్రాఫిక్స్...
 పోటీ మాత్రం రెండు పార్టీల మధ్యే
  జేడీఎస్ ది కింగ్ మేకర్ పాత్రే
వచ్చే సార్వత్రిక ఎన్నికలను  డిసైడ్ చేసే ఎన్నికలు 
మధ్య ప్రదేశ్ , రాజస్థాన్‌,  చత్తీస్ గఢ్  ఎన్నికలపైనా ప్రభావంల 
 
వాయిస్ ఓవర్...
 కర్ణాటకలో  మూడు ప్రధాన పార్టీలున్నాఇ ... కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్‌ (ఎస్‌).
పేరుకు మూడు పార్టీలే అయినా... పోటీ మాత్రం రెండు పార్టీల మధ్యే.  జేడీఎస్ ది కింగ్ మేకర్ పాత్రేగానీ... కింగ్ అయ్యే ఛాన్సే లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను... ఈ కర్ణాటక ఎలక్షన్లే డిసైడ్ చేయనున్నాయి.  అంతేకాదు... ఈ ఏడాది చివర్లో... మధ్య ప్రదేశ్ , రాజస్థాన్‌,  చత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాల్లో జరగబోతే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను... ఈ రిజల్ట్స్ ప్రతిబింబించనున్నాయి. రాజస్థాన్ లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని ఇప్పటికే సర్వేలు వస్తున్నాయి. కర్ణాటకలో ఓడితే... మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలైన  మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ , రాజస్థాన్ లో ... ఆ పార్టీకి ఎదురుగాలి వీయవచ్చు.
భవిష్యత్ పొత్తులకు కర్ణాటక ఫలితాలు కీలకం
 బీజేపీ గెలిస్తే ఆ పార్టీతో జాతీయ స్థాయిలో పొత్తులు 
లేకపోతే మరిన్ని పార్టీలు ఎన్డీఏకి గుడ్ బై! 
భవిష్యత్తులో ముఖ్యంగా లోక్‌సభకు జరిగే ఎన్నికలకు వ్యూహాలు తిరిగి రచించుకోడానికి, పొత్తులు కుదుర్చుకోడానికి  కర్ణాటక ఫలితాలు కీలకం. బీజేపీ గెలిస్తే... జాతీయ స్థాయిలో పొత్తులకు కూడా  ఉపకరిస్తుంది. లేకపోతే ఎన్డీఏ నుంచి తెలుగుదేశం వెళ్లిపోయినట్లే... మరిన్ని పార్టీలు బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది.   అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ వెంటనే అధికారంలోకి వచ్చిన చరిత్ర కర్ణాటకలో గత మూడు దశాబ్దాల్లో లేదు. మరి ఆ ట్రెండ్‌ను మార్చి సిద్ధరామయ్య -చరిత్రను తిరగరాయగలరా..  అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. ఇదే ఇప్పుడు బీజేపీలో గుబులు పుట్టిస్తోంది. 
 
 
మోదీ హవా దేశంలో చెక్కు చెదరలేదని నిరూపితమవుతుంది 
సార్వత్రిక ఎన్నికల్లో విజయం తమదేనని ఊదరగొడతారు 
కాంగ్రెస్ ఓడితే ఆ పార్టీని పట్టించుకోరు 
రాహుల్ నాయకత్వంపై నీలినీడలు అలముకుంటాయి 
మోదీ అంటే భయం మరింత పెరుగుతుంది ..
కర్ణాటకలో బీజేపీ గెలిస్తే ఏమవుతుంది... అందులో మొదటిది మోదీ హవా దేశంలో చెక్కు చెదరలేదని... 2019లో విజయం తమదేనంటూ అమిత్ షా అండ్ కో ఊదరుగొడుతుంది.  
మోదీ-అమిత్‌ షా ల ఎన్నికల వ్యూహాలకు తిరుగులేదని స్పష్టమవుతుంది. వచ్చే హిందీ బెల్ట్ లో అసెంబ్లీ ఎన్నికలకు బూస్ట్ వచ్చినట్లవుతుంది. 
2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం దిశగా తొలి సానుకూల సంకేతం వస్తుంది.
2019 ఎన్నికలకు కాంగ్రెసేతర ఫ్రంట్‌ ఏర్పాటుకు పార్టీల చర్యలకు ఊతం. కాంగ్రెస్ ఓడితే... ఆ పార్టీని పట్టించుకోకుండా మమతా బెనర్జీ, చంద్రబాబు,కేసీఆర్ లాంటివారు కూటములు కట్టే అవకాశం ఉంది.      కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ నాయకత్వానికి తొలి గట్టి దెబ్బ. రాహుల్ గాంధీ నాయకత్వంపైనే నీలినీడలు అలముకుంటాయి.  
బీజేపీ-వ్యతిరేక మహాకూటమి నిర్మాణానికి ఆదిలోనే హంసపాదు అవుతుంది. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుందోనని... అన్ని పార్టీల నేతలూ భయపడతారు.  ఉత్తర ప్రదేశ్   ఉప ఎన్నికల్లో పరాజయం తర్వాత మళ్లీ కాలూ, చేయి  కూడదీసుకోడానికి కర్ణాటక విజయం ఉపకరిస్తుంది .శివసేన లాంటి పార్టీలు బీజేపీతో  దోస్తీ  ఉంటుంది. 
 
 
సిద్ధరామయ్యపై ప్రశంసల జల్లు 
సిద్ధ  జాతీయ నేతగా ఎదిగినా ఎదగొచ్చు
రాహుల్‌గాంధీ నాయకత్వానికి కొత్త ఊపు వస్తుంది.
పొత్తుల సారథ్యం కాంగ్రెస్ కే దక్కే ఛాన్స్ 
సెక్యులరిజం నినాదాన్ని దేశవ్యాప్తం చేస్తారు
హిందీ బెల్ట్ లో కాంగ్రెస్ కు పట్టు వస్తుంది.
మరి  కాంగ్రెస్  గెలిస్తే పరిస్థితి ఏంటి?  మోదీ-షా ల చాణక్యం తట్టుకొని గెలిచిన వ్యక్తిగా సిద్ధరామయ్యపై ప్రశంసల జల్లు కురుస్తుంది. జాతీయ నేతగా ఎదిగినా ఎదగొచ్చు. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో కూడా సీఎం అభ్యర్థిని  కాంగ్రెస్   ముందే ప్రకటించే అవకాశం ఉంది.    రాహుల్‌గాంధీ నాయకత్వానికి కొత్త ఊపు వస్తుంది.
బీజేపీ-వ్యతిరేక మహాకూటమికి సారథ్యం వహించే అవకాశం  కాంగ్రెస్ కే దక్కే ఛాన్స్ ఉంది.  సెక్యులరిజానికి -మతతత్వానికి పోరాటంగా కాంగ్రెస్‌ అభివర్ణించింది. ఒకవేళ గెలిస్తే సెక్యులరిజం నినాదాన్ని దేశవ్యాప్తం చేసే అవకాశం ఉంది.     లింగాయత్‌లను ప్రత్యేక మతంగా పరిగణించాలన్న నిర్ణయంతో కేంద్రంపై భారం పడుతుంది. దాన్ని ఆమోదించకపోతే కేంద్రం కర్ణాటకకు అన్యాయం చేసిందన్న నినాదాన్ని ముందుకు తీసికెళ్లవచ్చు.
 కర్ణాటకలో విజయంతో ... బీజేపీకి పట్టున్న హిందీ బెల్ట్ లోనూ రణించగలమన్న నమ్మకం కాంగ్రెస్ కు వస్తుంది.  
కర్ణాటక ఎన్నికల్లో ఏఏ అంశాలు ప్రభావితం చేస్తాయి..? తెలుగువారే కాదు... తమిళ ఓటర్లు సైతం... బీజేపీ పుట్టెముంచడానికి సిద్ధమవుతున్నారా  ? కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డ్ నియమించబోమని బీజేపీ చెప్తోంది. మరి కన్నడలోని తమిళ ఓటర్లు ఎలా స్పందిస్తారు?
 
 తమిళనాడు ఓటర్లు చాలా కీలకం 
తెలుగువారికన్నా తమిళ ఓటర్లే ఎక్కువ 
తెలుగు ఓటర్లు 15 శాతం, తమిళులు 18 శాతం 
వాయిస్ ఓవర్...
తెలుగువారే కాదు ... తమిళనాడు ఓటర్లు సైతం కీలకం కాబోతున్నారా అంటే... అవుననే అంటున్నాయి సర్వేలు. తెలుగువారుకన్నా ... తమిళ ఓటర్లే ఎక్కువ. తెలుగు ఓటర్లు 15 శాతం ఉండగా... తమిళ మూలాలున్న ఓటర్లు 18 శాతం వరకు ఉన్నారు.  కర్ణాటకలో పార్టీల జాతకాలను తారుమారు చేసే స్థితిలో ఉన్నారు ఓటర్లు.
గ్రాఫిక్స్...
కావేరీ బోర్డ్ ఏర్పాటుచేయకపోవడంతో కమలనాథులపై ఆక్రోశం 
60 నియోజకవర్గాల్లో తమిళ ఓటర్ల ప్రభావం
బీజేపీ ఆశలు తల్లకిందులు చేసే అవకాశం
బీజేపీ అన్యాయం చేసిందంటున్న తమిళులు 
 
వాయిస్ ఓవర్...
కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డ్ ఏర్పాటు...  కర్ణాటకలో స్థిరపడ్డ తమిళ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.  ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వనందుకు కర్ణాటకలోని ప్రవాసాంధ్రులు బీజేపీపై గుర్రుగా ఉంటే.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరీ నిర్వాహక మండలిని ఏర్పాటు చేయకపోవడంపై కన్నడనాట స్థిరపడ్డ తమిళులు కమలనాథులపై ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. కర్ణాటకలోని దాదాపు 10 జిల్లాల్లోని 60 నియోజకవర్గాల్లో తమిళ ఓటర్లే కీలకం. ఈ ఎన్నికల్లో వారు తీసుకునే నిర్ణయం బీజేపీ ఆశలను తలకిందలు చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల వాదన. కేవలం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కావేరీ నిర్వాహక మండలిని కేంద్రం ఏర్పాటు చేయడం  లేదన్న భావన తమిళుల్లో బలంగా నాటుకుపోయింది. 
 
గ్రాఫిక్స్...
 కావేరీ వివాదంపై తన కోపాన్ని బీజేపీపై చూపెడుతోంది డీఎంకే
కావేరీ వివాదంపై మాట్లాడని  బీజేపీ 
కావేరీ వివాదం కాంగ్రెస్ కే లాభం
వాయిస్ ఓవర్... 
కర్ణాటకలో కాంగ్రెస్‌ లో అధికారంలో ఉంది. తమిళనాడులో విపక్ష డీఎంకే, కాంగ్రెస్‌ మధ్య చెలిమి కొనసాగుతోంది. ఎన్నికల వేళ సిద్దరామయ్య ప్రభుత్వంపై డీఎంకే విమర్శలు చేస్తే.. అది తమిళ ఓటర్లను తప్పకుండా ప్రభావితం చేస్తుంది. కాబట్టి డీఎంకే వ్యూహం మార్చుకుని.. కావేరీ వివాదంపై తన కోపాన్ని బీజేపీపై చూపెడుతోంది.  తమిళనాడులో జరుగుతున్న నిరసనలపై స్పందించేందుకు కర్ణాటకలోని బీజేపీ నేతలు నిరాకరిస్తున్నారు. పోలింగ్‌ తేదీ సమీపించే కొద్దీ తమిళ ఓటర్లను మచ్చిక చేసుకునేపనిలో కాంగ్రెస్ నేతలు  ఉన్నారు.  తమిళ మూలాలున్న వ్యాపారవర్గాలంతా కాంగ్రె్‌సకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తమిళనేతలు చెబుతున్నారు. ఇదే జరిగితే...  కన్నడభూమిలో...
బీజేపీ పుట్టెమునుగుతుంది.
 
వాయిస్ ఓవర్... 
కాంగ్రెస్ చేతిలోనున్న ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటక కావడంతో ... మరోసారి ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు ఆ పార్టీ శాయశక్తులా కృషి చేస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 19 లోక్ సభ స్థానాలను గెలిచాం కదా... ఈ సారి అధికారం తమదేనన్న భావనలో ఉంది బీజేపీ. అయితే కులాలు మతాలే కాదు...
కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు చాలానే ఉన్నాయి.
 
.
కర్ణాటక ప్రైడ్ పేరుతో సిద్ధరామయ్య క్యాంపైన్ 
కన్నడ భాషకు సరైన గౌరవం దక్కడంలేదంటూ వాదన
ఇది కాంగ్రెస్ కు బాగా ప్లస్ పాయింట్.
కర్ణాటక ప్రైడ్ పేరుతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక క్యాంపైన్ నే నడుపుతున్నారు.  కర్ణాటకకు ప్రత్యేక జెండా ఉండాలని... కన్నడ భాషకు సరైన గౌరవం దక్కడం లేదంటూ ఉద్యమిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ దూసుకెళ్తుండగా... బీజేపీ ఇంకా ఉత్తరభారత క్యాంపైనర్లనే రంగంలోకి దించింది.  ఇది కాంగ్రెస్ కు బాగా ప్లస్ 
3,515 మంది రైతుల ఆత్మహత్యలు
అప్పుల ఊబిలో రైతులు
60 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం
 
 
కర్ణాటక వ్యవసాయరంగం బాగా దెబ్బతింది. 201 3 నుంచి ఇప్పటి వరకు 3 వేల515 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులంతా అప్పుల ఊబిలోనున్నారు. అంతేకాదు కర్ణాటకలో 60 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. యడ్యూరప్ప హయాంలో వీరంతా బాగా ఇబ్బందిపడ్డారు. అందుకే కావేరీ విషయంలో ... తమిళనాడు రైతులతో కన్నడిగులు తలపడుతున్నారు..
 ఓటర్లు
అవినీతి ఆరోపణలు లేవు
స్కాంలు జరగలేదు
ఇది కాంగ్రెస్ కు బాగా కలిసివచ్చే అంశం 
.మరీ సూపర్బ్అని చెప్పలేం గానీ... కర్ణాటకలో కాంగ్రెస్ నేత  సిద్ధరామయ్య మంచి పాలననే అందిస్తున్నారు. 
ప్రభుత్వ వ్యతిరేక ఓటుకూడా పెద్దగా లేదు. అంతేకాదు గతంలో బీజేపీ సీఎం యడ్యూరప్పతో పోల్చితే... సిద్ధ  కొంత నీతిమంతమైన పాలననే అందిస్తున్నారు. పెద్దగా అవినీతి ఆరోపణలు లేవు. స్కాంలు జరగలేదు. ఇది కాంగ్రెస్ కు బాగా కలిసివచ్చే అంశం. 

Related Posts