YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

యాదాద్రిలో సీఎం కేసీఆర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అధికారులు

యాదాద్రిలో సీఎం కేసీఆర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అధికారులు

యాదాద్రి మార్చి 4, 
యాదాద్రి పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ గురువారం  మధ్యాహ్నాం 12.20 గంటలకు కొండపైకి చేరుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. యాదాద్రి ఆలయ పునర్నిమాణంలో భాగంగా సీఎం కేసీఆర్ 14వ సారి యాదాద్రి పర్యటనకు వచ్చారు. బాలాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదాద్రి పునర్నిమాణ పనులను పరిశీలించారు. తరువాత  స్థపతి వేలు, ఆనంద్ సాయి, యాడా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పనులపై దిశా నిర్దేశం చేసారు.  మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రత్యేకంగా తయారు చేయించిన క్యూ లైన్లులను పరిశీలించారు. బంగారు వర్ణంలో తయారు చేయబడిన క్యూలైన్ గ్రిల్స్పై శంకుచక్రాలు, గోవిందా నామాలు, ముఖ మండపం, ఐరావతం బొమ్మలు, అల్లికలను ప్రత్యేకంగా పరిశీలించిన సీఎం కేసీఆర్ క్యూలైన్లపై పలు సూచనలు చేశారు. ఆలయ మాడవీధుల్లో సుందరీకరణ, విద్యుద్దీపాలు ఏర్పాటు చేసేందుకు స్తంభాలకు సంబంధించిన వివరాలు ఆనంద్ సాయి సీఎంకు వివరించారు. మాఢ వీధులు, ప్రాకార మండపాలు, దర్శన సముదాయాలను, బ్రహ్మోత్సవం మండపాన్ని, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లను పరిశీలించారు.  సీఎం కేసీఆర్ పర్యటనలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.   సీఎం పర్యటన కోసం వైటీడీఏ, ఆర్అండ్బీ, రెవెన్యూ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భువనగిరి జోన్ డీసీపీ కె.నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related Posts