YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 5 వ తేదీన బంద్ కు సహకరించండి

విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 5 వ తేదీన బంద్ కు సహకరించండి

దేవనకొండ  మార్చి 4, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్ష, విద్యార్టీ, యువజన, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల ఐదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. బందును విజయవంతం చేయాలని దేవనకొండ  మండల పరిధిలో ఉన్నటువంటి విద్యసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, అన్ని ప్రజా, కుల సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరుతూ ఈరోజు కరపత్రాలు పంచుతూ మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా సీపీఐ, సీపీఎం,సీఐటీయూ, ఏఐటీయూసీ, ఇతర కార్మిక సంఘాల నాయకులు బి.వీరశేఖర్,ఎమ్.నరసరావ్,నెట్టేకల్,అశోక్,ఇబ్రహీం, మాదన్న, శ్రీనివాసులు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts