YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

మోడీకి కేటీఆర్ ట్వీట్

మోడీకి కేటీఆర్ ట్వీట్

మోడీకి కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, మార్చి 4,
దేశంలో ప్రస్తుతం నిరసనలకు తావిస్తున్న అంశాలపై మంత్రికేటీఆర్ స్పందించారు. కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్నంటున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వీటికి వ్యతిరేకంగా ప్రస్తుతం నిరసనలు హోరెత్తెతుతున్నాయి. అయితే, కొన్నాళ్లుగా ఈ వ్యవహారంపై అంతగా స్పందించని మంత్రి కేటీఆర్ తాజాగా దీటుగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పెట్రోల్, గ్యాస్ ధరలపై ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. మోదీ తీరును ఎండగట్టారు. ఆయన గతంలో మాట్లాడిన గ్యాస్, పెట్రోల్ ధరలపై స్పందించిన వీడియోను ట్వీట్ చేశారు.ఏడేళ్ల క్రితం యూపీఏ ప్రభుత్వ హయాంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరిగితే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శించారని మంత్రి కేటీఆర్‌ మంగళవారం రాత్రి (మార్చి 3) ట్వీట్ చేశారు. ఆ సమయంలో కొద్ది ధరలు పెరిగితే విమర్శించిన బీజేపీ నేతలు ఇప్పుడు ప్రజలకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పుడు అసాధారణ స్థాయిలో పెరుగుతున్న గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెంపునకు ఎవరు బాధ్యత వహిస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.2014కు ముందు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ, బీజేపీ నేతలు స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్‌లు గతంలో మీడియాతో మాట్లాడిన వీడియోలను కలిపి కేటీఆర్‌ ట్విటర్లో ఉంచారు. దాంతో పాటు 2015, 2021లో పెట్రోలు, వంట గ్యాస్ సిలిండర్‌ ధరలు ఎలా ఉన్నాయో పోల్చారు.2015లో పెట్రోలు రూ.56.49 ఉండేదని, 2021లో రూ.100కు చేరిందని గుర్తు చేశారు. ఎల్‌‌పీజీ వంట గ్యాస్ కూడా 2015లో రూ.414 ఉండేదని, 2021లో రూ.819 అయిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. గత 3 నెలల్లోనే సిలిండర్‌పై రూ.225 మేర ధరలు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు.

Related Posts