తిరుపతి, మార్చి 4
కన్న తల్లిని, జన్మభూమిని మాతృ బాషను, మాతృ దేశాన్ని మరచి పోకూడదని భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. గురువారం భారత ఉపరాష్ట్రపతి కరకంబాడి వద్ద గల అమర ఆసుపత్రి ప్రారంభోత్సవానంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మాట్లాడుతూ కరకంబాడి లో అమర ఆసుపత్రిని ప్రారంభించడం చాలా సంతోషం గా ఉందని, ఈ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేసిన అమర ఆసుపత్రి ఛైర్మన్ డా. ప్రసాద్ గౌరినేని, మేనేజింగ్ డైరెక్టర్ డా. రమాదేవి గౌరినేని లను అభినందిస్తున్నానని తెలిపారు. ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ ఆసుపత్రికి వచ్చే వారు ఆరోగ్యంగా, సంతోషంగా తిరిగి వెళ్లాలని కోరుకుంటున్నానన్నారు. కోవిడ్ సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించిన డాక్టర్లు, నర్సులు, సిబ్బందిని అభినందిస్తున్నానని అలాగే అనూహ్యంగా పంటలను పండించిన రైతులను గుర్తు పెట్టుకోవాలన్నారు. శారీక దృఢత్వాన్ని పెంచుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని తెలిపారు. బలవర్థకమైన ఆహారం తీసుకుని, మంచి అలవాట్లు కలిగి ఉండాలన్నారు.
భారత ఉప రాష్ట్రపతి వెంట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖా మంత్రి కె. నారాయణస్వామి, చంద్రగిరి శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, గుంటూరు ఎం.పి గల్లా జయదేవ్, ఎంఎల్సి గౌనివాని శ్రీనివాసులు, తిరుపతి, శ్రీకాళహస్తి ఎమెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధు సుధాన్ రెడ్డిలు, అమర ఆసుపత్రి ఛైర్మన్ డా. ప్రసాద్ గౌరినేని, మేనేజింగ్ డైరెక్టర్ డా. రమాదేవి గౌరినేని, అమర రాజా గ్రూప్ ఫౌండేర్ డా. రామచంద్ర నాయుడు గల్లా, కో – ఫౌండేర్ అరుణ కుమారి గల్లా, తదితరులు పాల్గొన్నారు.