YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మహిళా అధ్యక్షురాలి స్థానంలో కిల్లి

మహిళా అధ్యక్షురాలి స్థానంలో కిల్లి

విజయవాడ, మార్చి 5, 
శ్రీకాకుళం జిల్లాకు చెందిన డాక్టరమ్మ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కోరిక ఎట్టకేలకు నెరవేరబోతోందిట. ఆమె లోక్ సభకు ఒక పర్యాయం ఎన్నిక అయింది. 2009 ఎన్నికల వేళ అప్పటికి అప్రతిహతంగా నాలుగు విడతలుగా శ్రీకాకుళం నుంచి గెలుస్తూ వస్తున్న దిగ్గజ నేత కింజరాపు ఎర్రన్నాయుడుని ఓడించి దేశం దృష్టిని ఆకర్షించారు. ఆమె వైద్యురాలుగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా జనాలకు చేరువ అయ్యారు. దాంతో అన్నీ కలసి అలా విజయం సాధించిపెట్టాయి. ఆమెను గుర్తించి యూపీఏ టూ లో కేంద్ర మంత్రిగా సోనియా గాంధీ అవకాశం ఇచ్చారు.కిల్లి కృపారాణి రాజకీయమంతా ఢిల్లీ చుట్టూనే తిరుగుతోంది. ఆమె అయిదేళ్ళ పాటు చాలా డిగ్నిఫైడ్ గా రాజకీయం చేశారు. అక్కడ మంచి పరిచయాలను పెంచుకున్నారు. ఇక మేధావి వర్గానికి చెందిన తనకు లోకల్ పాలిటిక్స్ కంటే కూడా పార్లమెంట్ అయితేనే ఇష్టమని ఆమె పలు సందర్భాల్లో అధినాయకత్వం దృష్టికి కూడా తెచ్చారు. అయితే జగన్ ఆలోచనలు వేరు. ఆమెను శ్రీకాకుళం లోక్ సభ నుంచి పోటీ చేయించి ఎంపీని చేయాలనుకుంటే ఆమె మాత్రం పెద్దల సభను కోరుకుంటున్నారు.జగన్ మాట తప్పరు, మడమ తిప్పరు అని వైసీపీ నేతలు చెబుతారు. అలాగే తాను నమ్ముకున్న వారి విషయంలో అయితే జగన్ క్షణం కూడా ఆగరు, ఇపుడు అలా తాను కోరి మరీ పార్టీలోకి ఆహ్వానించిన కిల్లి కృపారాణీని రాజ్య సభకు పంపాలని జగన్ గట్టిగానే నిర్ణయించారట. 2022లో ఏపీ నుంచి ఖాళీ అయ్యే సీట్లలో ఒక దాన్ని కిల్లి కృపారాణికి ఆల్ రెడీ రిజర్వ్ చేశారని అంటున్నారు. ఈ మేరకు ఇటీవల విశాఖ వచ్చిన జగన్ శ్రీకాకుళం నేతలతో ముచ్చటిస్తూ ఎవరి బాధ్యతలు ఏంటి అన్నది స్పష్టంగా చెప్పేశారు అని ప్రచారం సాగుతోంది.వైసీపీకి ఇప్పటికే ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే ఒక్క మహిళ కూడా లేరు. అందునా బీసీ వర్గానికి చెంది మేధావిగా గుర్తింపు పొందిన కిల్లి కృపారాణిని నామినేట్ చేస్తే పార్టీ ప్రతిష్ట కూడా ఇనుమడిస్తుందని జగన్ ఆలోచిస్తున్నారుట. ఇక ఢిల్లీలో కిల్లికి ఉన్న పరిచయాలు, ఆమె కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా పార్టీకి కలసి వస్తుందని అంచనా వేస్తున్నారుట. రాజకీయంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న కాళింగ సామాజిక వర్గం నుంచి ఆమెను ఎంపిక చేయడం ద్వారా ఆ వర్గం మద్దతుని దండీగా పొందవచ్చుని అన్న లెక్కలు కూడా వేసుకుంటున్నారుట.ఇక కిల్లి కృపారాణి సేవలను ఏపీలో పార్టీ పరంగా ఉపయోగించుకోవడానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా కూడా తొందరలోనే జగన్ నియమిస్తారు అని కూడా అంటున్నారు. ఆమె తన వాదనా పటిమతో బీసీలను పార్టీ వైపు తిప్పుతారని జగన్ ఆశిస్తున్నారుట. రోజా ఇపుడు ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవిలో ఉన్నందున పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు అని తలచే ఈ మార్పు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి కిల్లి కృపారాణికి వరస పదవుల జాక్ పాట్ తగలబోతోంది అని అంటున్నారు.

Related Posts