YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

నాలుగు రాష్ట్రాల్లో అన్నదాతల ఉసురు తప్పదా

నాలుగు రాష్ట్రాల్లో అన్నదాతల ఉసురు తప్పదా

న్యూఢిల్లీ,మార్చి 5,
రైతులంటే రైతులేనండీ. ఎవ‌రు ఎంత పెద్ద పొజిష‌న్ లో ఉన్నా స‌రే.. రైతు విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే పాపం త‌గులుతుంది. అయినా అన్న‌దాత‌పై పంతాలు ఏంటండీ. ఆరుగాలాలు క‌ష్ట‌ప‌డి అంద‌రికీ బుక్కెడు బువ్వ పెడుతుంటే.. వారిపై కక్ష సాధింపులా.. వారిని నాశ‌నం చేసే ప్లాన్ లా.. అయినా అంత‌గా ఉద్య‌మం చేస్తుంటే ఆ చ‌ట్టాలు ఏవో ర‌ద్దు చేసి.. వాళ్ల‌తో మాట్లాడి  మంచి చ‌ట్టాలు ప్లాన్ చేయొచ్చు క‌దా. అయినా.. చ‌ట్టాలు ర‌ద్ద చేయ‌డానికి పీఎం మోడీ ఎందుకు అంత ప‌ట్టు ప‌డుతున్నారు.  ర‌ద్దు చేసి.. రండి కూర్చుందాం.. కొత్త‌గా ప్లాన్ చేద్దాం అనొచ్చు క‌దా. అయినా.. చట్టాలు చేసే టైంలోనే వారితో మాట్లాడి చేయొచ్చు క‌దా. కోట్ల మంది రైతుల‌పై.. వంద కోట్ల మంది భార‌తీయుల‌పై ప్ర‌భావం చూపే చ‌ట్టాల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి క‌దా. లేదంటే.. ఇప్పుడైనా ఆలోచించి.. ముందుకెళ్లాలి క‌దా అంటూ.. దేశ వ్యాప్తంగా అన్ని రంగాల‌కి చెందిన వారూ.. రైతుల‌కే మ‌ద్ద‌తు ఇస్తున్నారు. రైతుల‌కి యాంటీగా.. ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా ఉన్న స్టార్ల‌ని, క్రికెట‌ర్ల‌ని తిట్టి పోస్తున్నారు. చూస్తూనే ఉన్నాం క‌దా.  అయితే.. రైతుల పాపం ఊరికే పోతుందా అంటున్నారు జ‌నాలు. అవును.. ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఒక కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన పాండిచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. ఈ ఎన్నిక‌ల్లో అస్సాంలో త‌ప్ప‌.. మ‌రే చోటా ప‌ట్టులేదు బీజేపీకి. త‌మిళ‌నాడులో ప‌రిస్థితి మరీ దారుణం.. అన్నా డీఎంకే పొజిష‌నే బ్యాడ్ గా ఉంటే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది బీజేపీ. వాళ్లు కూడా గెల‌వం అని ఫిక్స్ అయిన ఓ 15 సీట్లు బీజేపీకి కేటాయించారు.  పాండిచ్చేరిలో కూడా అంతే. అలాగే కేర‌ళ‌లోనూ సేమ్ సీన్.. బీజేపీకి ప‌ట్టులేదు. ఇక పోతే.. ప‌శ్చిమ బెంగాల్ పై మాత్రం గ‌ట్టిగానే ఫోక‌స్ చేశారు. మ‌మ‌త మాటి మాటికీ బీజేపీని ఇబ్బంది పెడుతున్నార‌ని ఫోక‌స్ చేశారు. కానీ.. అక్క‌డ రైతు ఉద్య‌మం ఎఫెక్ట్ గ‌ట్టిగానే ఉంది. బీహార్, పంజాబ్ రైతులు కాబ‌ట్టి.. ప‌శ్చిమ‌బెంగాల్ పై రైతు ఉద్య‌మం ఎఫెక్ట్ ఉండ‌డంతో.. ఈసారి బీజేపీకి బ్యాడ్ రిజ‌ల్ట్ త‌ప్ప‌దు అంటున్నారు.  అప్ప‌టి ఎన్నిక‌ల్లో లాగే రిజ‌ల్ట్ వ‌స్తుంద‌ని.. మ‌ధ్య‌లో బీజేపీ ఎదిగినా.. రైతు ఉద్య‌మంతో అంతా వ్య‌తిరేక‌త వ‌చ్చింది అంటున్నారు. అలాగే.. రైతులు కూడా త‌గ్గ‌డం లేదు. అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల్లో... బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తాం అంటున్నారు రైతులు. సో.. ప్ర‌స్తుతం జ‌రగ‌నున్న ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీకి.. అన్న‌దాత ఆగ్ర‌హానికి సంబంధించిన దెబ్బ త‌ప్ప‌దు అనే టాక్ ఫుల్ గా ఉంది.

Related Posts