YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

ఏపీలో బీజేపీ ఖాళీ

ఏపీలో బీజేపీ ఖాళీ
() ప్రత్యేకహోదా ఉద్యమం దెబ్బకి ఆంధ్రప్రదేశ్‌బీజేపీ ఖాళీ అవ్వబోతుందా..? దక్షిణాదిలో జెండా ఎగురవేయాలనే బీజేపీ కల.., కలగానే మిగిలిపోతుందా..? రాష్ట్ర విభజన చేసినప్పుడు కాంగ్రెస్‌కి బుద్ది చెప్పిన ప్రజలు, ప్రత్యేకహోదా పోరులో బీజేపీకి గుణపాఠం చెప్పబోతున్నారా.. కీలకనేతలుగా ఉన్న నేతలు ఎవరిదారి వాళ్లు చూసుకోబోతున్నారా..? ఇంతకీ ఏపీ బీజేపీలో ఏం జరుగుతోంది.?: కలిసున్న రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ఏపీ ప్రజలు. ఇఫ్పుడు ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో బీజేపీ చేసిన మోసానికి రాబోయే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు ఏపీ బీజేపీలో లుకలుకలు మొదలయ్యాయి. అధ్యక్షుడి ఎంపిక విషయంలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. కన్నా లక్ష్మీనారాయణకు పార్టీలో తగిన ప్రాధాన్య ఇస్తామని అధిస్టానం గతంలోనే హామీ ఇచ్చింది. అయితే గత కొన్నిరోజులుగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. తనకు అవకాశం ఇస్తారని కన్నా లక్ష్మీనారాయణ భావించినప్పటికీ.. ఆ పదవిని సోమువీర్రాజు, లేదంటూ మాణిక్యాలరావుకు ఇవ్వాలని అధిష్టానం యోచిస్తోంది. దీంతో తననే అధ్యక్ష పదవి వరిస్తుందని.. భావించిన కన్నాకు మొండిచేయి ఇచ్చినట్లయింది. దీంతో మనస్థాపానికి గురైన కన్నా పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామాను అధిష్టానానికి పంపించారు. అంతేకాదు.. వైసీపీలో చేరేందుకు రంగం కూడా సిద్ధం చేసుకున్నారు కూడా. అటు ఏలూరు మాజీ ఎంపీ.. కావూరీ సాంబశివరావు కూడా పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారు. సాంబశివరావు పార్టీని వీడుతున్నారని ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతోంది కూడా. ఒకవేళ దూరమైతే.. ఆయన సామాజికవర్గానికి చెందిన ఓట్లు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి.  మరోవైపు ప్రత్యేకహాదా విషయంలో అధిష్టానం స్పందించకపోవడం పార్టీకి నష్టమేనని సొంతపార్టీ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డి తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చని ఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని... ప్రజల వైపే తానుంటానని, హోదా ఇవ్వకపోతే పార్టీని వీడుతానని చెప్పిన కాటసాని కూడా వైసీపీ వైపు చూస్తున్నారు. దీంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా కొంతమేర బీజేపీకి దూరమయ్యే అవకాశం ఉంది. మరోవైపు అధ్యక్ష పదవి రేసులో పురంధేశ్వరీ పేరు వినిపించినప్పటికీ.. తనకు రాష్ట్ర రాజకీయాల కంటే జాతీయ రాజకీయాలంటేనే ఇష్టం అని చెప్పడంతో బ్యాక్‌స్టెప్‌వేశారు.  టీడీపీపై ఒంటి కాలిపై లేచే ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు పదవిస్తే పార్టీ చీలుతుందని ఆకుల ఓకవైపు, సోము వీర్రాజుకే అధ్యక్షపదవి ఇవ్వాలన్న మాణిక్యాలరావు మరోవైపు, వీళ్లిద్దరిలో ఎవరి మాట విన్నా మరొకరు పార్టీలో కొనసాగుతారా లేదా అనేది మిలియన్‌డాలర్ల ప్రశ్నగా మారింది.  

Related Posts