YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం

భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం

హైదరాబాద్, మార్చి 5, 
హైదరాబాద్‌ మహా నగర పరిధిలో విద్యుత్‌ డిమాండు క్రమక్రమంగా పెరుగుతోంది. ఫిబ్రవరి నెల ముగిసి మార్చిలోకి రాగానే ఒక్కసారిగా విద్యుత్‌ వినియోగం 50 మిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. గత రెండు, మూడు రోజులుగా ఎండల ప్రభావం తీవ్రం కావడంతో ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వినియోగం అధికమైంది. ప్రధానంగా ఫ్యాన్లు, ఏసీ, కూలింగ్‌ యంత్రాలను ఎక్కువగా వాడుతున్నారు. వేసవిలో పెరిగే విద్యుత్‌ డిమాండును దృష్టిలో పెట్టుకొని గ్రేటర్‌ జోన్‌ పరిధిలోని తొమ్మిది సర్కిళ్లలో అదనపు ఏర్పాట్లు చేశారు. ప్రతి యేటా వేసవి రాగానే పెరిగే డిమాండుతో పాటు, కొత్తగా పెరిగే కనెక్షన్లతో విద్యుత్‌ డిమాండు అధికంగా ఉంటుంది. ప్రస్తుతం, ప్రతిరోజు పీక్‌ అవర్‌ డిమాండు 2000 మెగావాట్ల వరకు ఉండగా, ఏప్రిల్‌, మే నెలల్లో అయితే, ఒక్కసారిగా 3500 మెగావాట్లకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే అదనపు ఏర్పాట్లు చేశారు. గృహ విద్యుత్‌ వినియోగంతో పాటు వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, మెట్రో, రైల్వే, ఐటీ సంస్థలు ఈ వేసవిలో యధావిధిగా పనిచేయనున్నాయి. ప్రధానంగా కరోనా వైరస్‌ నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశం ఇచ్చినా, దాన్ని దశల వారిగా తగ్గిస్తోంది. చాలా కంపెనీలు మార్చి చివరి నాటి నుంచి, లేదంటే ఏప్రిల్‌లో ఐటీ కంపెనీలు సైతం పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం ఉందని ఐటీ పరిశ్రమల వర్గాలు పేర్కొంటున్నారు. దీంతో ఈ వేసవిలో విద్యుత్‌ వినియోగం బాగా పెరుగుతుందనే అంచనాతో అధికారులు ఉన్నారు. మార్చి నెల ప్రారంభంలో 50 మిలియన్లు యూనిట్లు నమోదు కాగా, ఏప్రిల్‌, మే నెలల్లో అది 75 మిలియన్‌ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.కరోనా వైరస్‌ నేపథ్యంలో గతేడాది మార్చి 22 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పరిశ్రమలు మూత పడ్డాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర సరుకుల వ్యాపారాలు మినహాయిస్తే.. మిగతా ఏ వ్యాపారాలు నడవలేదు. ఆ సమయంలో గ్రేటర్‌ పరిధిలో రోజు వారి విద్యుత్‌ వినియోగం 39 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది. ప్రస్తుతం, మార్చి నెల ప్రారంభం నుంచే 50 మిలియన్‌ యూనిట్ల వినియోగం జరుగుతోంది. రోజు రోజుకు ఎం డల తీవ్రత పెరిగే విద్యుత్‌ వినియోగం మరింతగా పెరుగుతుందని విద్యుత్‌ శాఖ అధికారులు  పేర్కొన్నారు. వేసవిలో ఎంత డిమాండు అవసరమైనా ఆ స్థాయిలో సరఫరా చేసేందుకు విద్యు త్‌ పంపిణీ సంస్థ క్షేత్ర స్థాయి లో అన్ని ఏర్పాట్లు చేస్తోం ది. సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ పేరుతో ఇప్పటికే అదనంగా పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త లైన్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పా టు చేశారని తెలిపారు

Related Posts