బోథ్ మార్చి 5,
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాల లో కొందరి విద్యార్థులకు అనారోగ్యానికి గురి కావడం, వారిలో కొంతమందికి కరోనా పాజీటివ్ రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. విద్యార్ధులకు స్థానిక ప్రభుత్వ దవాఖాన లో పరిక్షలు చెయించిన విషయం తెలిసిందే. మొత్తం 38 మంది ఉద్యార్థులకు మరియు 10 ఉపాధ్యాయులకు, సిబ్బందికి టెస్టులు కరోనాన చేయగా అందులో నుండి 5 గురి విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్లు డాక్టరులు నిర్ధారించారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులను వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థులను తమ తమ ఇండ్లలోకి తిసుకెళ్లిపోయారు. మిగతా 33 మంది విద్యార్థులను సైతం ముందు జాగ్రత్త చర్యగా 10 రోజులపాటు వారివారి ఇళ్లకు పంపివేసారు. హస్టల్, స్కూలు పరిసరాలను శానిటైజింగ్ జరిపారు. పాజిటివ్ కేసులను అయా ప్రాంతాల వైద్యధికారులకు సమాచారం ఇచ్చారు.