పగిడ్యాల మార్చి 5,
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటి ఆధ్వర్యంలోచేపట్టిన బంద్ పగిడ్యాల మండలం లోని zphహై స్కూల్ మోడల్ స్కూల్ ప్రాత కోట లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు అఖిల భారత విద్యార్థి సమైక్య (aisf)ఆధ్వర్యంలో మండల కార్యదర్శి వినోద్ కుమార్ ,హర్ష తదితరులు పాఠశాలను ముగించి బందును విజయవంతం చేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరికించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు పూర్తిగా భారతీయ జనతాపార్టీ ఒక వ్యాపార పార్టీగా మారిందని చెప్పి మేము తెలియజేస్తున్నామని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి మౌలిక వసతులు కల్పించాలి తప్ప నష్టాల్లో ఉన్నాయని ప్రైవేటు పరం చేయడం పద్ధతి కాదన్నారు తక్షణమే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు పవన్,రాజు,మని,మియస తదితరులు పాల్గొన్నారు