YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి

పెద్దపల్లి  మార్చి 5, 
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రద్దుచేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల పోరాటం 100 రోజులు నిండిన సందర్బంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా  సంఘీభావ దివాస్ నిర్వహించారు. ఈ సందర్బంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీఐటీయూ కె వి పి యస్,ఎస్ ఎఫ్ ఐ, డీ వై ఎఫ్ ఐ, వ్య.కా.స ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు.ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు ,కేవీపీయస్ జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్,ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి సిపెళ్లి రవీందర్, వ్య.కా.స జిల్లా అధ్యక్షుడు మంద రవీందర్ లు మాట్లాడుతూ నూతన చట్టాల వల్ల  రైతులకు నష్టం జరుగుతుందని,దీనివల్ల కార్పొరేట్ల హస్తాల్లోకి వ్యవసాయం పోతుందని వారికి లాభం చేకూరుతుందని అన్నారు.దాని వల్ల వ్యవసాయ ఆధారిత ప్రజల జీవనం మరింతగా దుర్భరంగా మారుతుందని అన్నారు.బీజేపీ ప్రభుత్వం దేశంలో మొత్తం ప్రజానీకం,ముక్యంగా పెద్ద మొత్తంలో రైతులు వ్యతిరేకిస్తున్న చట్టాలు తేవాల్సిన పని లేదని అన్నారు.ఈ చట్టాల ద్వారం వ్యవసాయాన్ని మొత్తాన్ని అంబానీ,ఆధాని లకు అప్పగించడానికే తహతహలాడుతుంన్నారని అన్నారు.గత 100 రోజులుగా చలిలో అనేక ఇబ్బందులు పడుతూ మొక్కువోని దీక్షతో రైతులు పోరాటాలు చేస్తే ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు.ఈ పోరాటంలో అనేక కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయారని అన్నారు.రైతులు ప్రాణాలు అర్పించున మోడీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు.ఇప్పటికైన రైతుల పట్టుదలను గుర్తించి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా మరింత మద్దతు కూడగట్టి పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని అన్నారు.

Related Posts