YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పుర సమరానికి హోరాహోరీ ప్రచారం ౼ గడప గడపకూ వైఎస్సార్సీపీ దళం

పుర సమరానికి హోరాహోరీ ప్రచారం ౼ గడప గడపకూ వైఎస్సార్సీపీ దళం

ఎమ్మిగనూరు మార్చి 5, 
పట్టణంలో పురపాలక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.అభ్యర్థుల తరఫున నేతలు, కుటుంబ సభ్యులు పెద్దఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.నేతలకు ఆయా వార్డు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు సంక్షేమ పథకాలను ప్రచార అస్త్రాలుగా మలుచుకోగా.. పెరిగిన ధరలను ప్రతిపక్షాలు జనంలోకి తీసుకెళ్తున్నాయి.మున్సిపల్ ఎన్నికల నిమిత్తం... పట్టణంలో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, వీరశైవలింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్,తేదేపా మాజీ ఎమ్మెల్యే బి.వి జయనాగేశ్వర రెడ్డి అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. 34వ వార్డులో ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి వి.పద్మావతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలని కోరారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర పథకాలతోనే పట్టణాల్లో మెరుగైన వసతులు కల్పించడం జరుగుతోందని ఆయన వివరించారు.23,24వ వార్డుల్లో వీరశైవలింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రగౌడ్ ఇంటింటికి తిరుగుతూ వైఎస్సార్సీపీ అభ్యర్థులైన చంద్రమోహన్ రెడ్డి,రామంజినమ్మ లను తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. వార్డుల్లో రుద్రగౌడ్ మాట్లాడుతూ సంక్షేమ రాజ్యం రావాలంటే వైకాపా అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేశారు.1వ వార్డులో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి నాగేశప్ప,2వ వార్డులో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి గడిగే అంపమ్మ  ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు 11వ వార్డులో తేదేపా కౌన్సిలర్ అభ్యర్థి కటికె జహంగీర్ బాషా ప్రచారంలో పాల్గొన్నారు.2,3వ వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే బి.వి జయనాగేశ్వర రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.తెదేపా కౌన్సిలర్ అభ్యర్థులు జి.ఈరమ్మ,కనికే లక్ష్మీ దేవిల తరుపున ఆయా వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.32వ వార్డులో తెదేపా కౌన్సిలర్ అభ్యర్తి కె.పార్వతి తరుపున ప్రచారంలో పాల్గొన్నారు.నిత్యావసరాల ధరలు పెరగడంతో పట్టణ ప్రజల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని బి.వి  విమర్శించారు. అసంఘటిత కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడానికి వైకాపా ప్రభుత్వమే కారణమని ఆయన మండిపడ్డారు.30వ వార్డులో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఎం.చెన్నమ్మ తరుపున ఆమె కుమారుడు విశ్వనాథ్ ప్రతి ఇంటి తలుపు తడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నాడు.32వ వార్డులో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి కోటకొండ నర్సింహులు తరుపున టౌన్ బ్యాంక్ చైర్మన్ కొమ్ము రాజు ప్రచారంలో పాల్గొన్నారు.

Related Posts