నందికొట్కూరు మార్చి 5,
రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడిని విమానాశ్రయంలో నిర్బంధించారని,అధికారం, డబ్బు, పోలీసు బలంతో తమకు ఇష్టం వచ్చినట్లుగా పాలన సాగిస్తున్నారని, ఇది ఎంతో కాలం సాగదని నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి అన్నారు .శుక్రవారం 15,18,19,29 వార్డులలో టిడిపి అభ్యర్థుల తరుపున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తించాలని, అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తెదేపా అభ్యర్థుల చేత బలవంతంగా నామినేషన్ పత్రాలను ఉపసంహరించారని ఆరోపించారు. వేధింపులు,బెదిరింపులతో వైసీపీ నాయకులు ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు.ఏం చేశారని జగన్ కు ప్రజలు ఓట్లు వేస్తారు అని ప్రశ్నించారు. నవరత్నాల వలన జగన్ పార్టీ కి ఓట్లు రావని జగన్ మోహన్ రెడ్డి కి భయం పట్టుకుందని ఏద్దేవ చేశారు. తెలుగుదేశం ప్రభత్వం చేసిన అభివృద్ది తప్ప రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదన్నారు.ప్రజా సంక్షమమే లక్ష్యంగా టిడిపి ప్రభుత్వం పాలన చేసిందన్నారు. మున్సిపల్ ఎన్నికలలో అత్యధిక స్థానాలలో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థుల విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు.టిడిపి అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మాజీ ఎంపీపీ ప్రసాద రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గుండం రమణా రెడ్డి, సురేంద్ర నాథ్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వేణు గోపాల్, మద్దిలేటి, జయసూర్య, తదితరులు పాల్గొన్నారు.