ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా హీరోలకే అధిక పారితోషికం అందుతుంటుంది. ఈ విషయంలో నిర్మాతలు ఆలోచించాలని హీరోలతో సమానంగా తమకు పారితోషికం ఇవ్వాలని పలువురు టాప్ హీరోయిన్లు తమ అసహనాన్ని వ్యక్తపరిచిన విషయాలు చాలానే ఉన్నాయి. అయితే దీనిపై స్పందించిన అనుష్క మాత్రం.. అధిక పారితోషికం తీసుకోవడానికి హీరోలే అర్హులని చెప్పింది.
చాలా సినిమాలను హీరోలు తమ భుజాలపై వేసుకుంటారు కాబట్టి వారు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడంలో తప్పు లేదన్నది తన అభిప్రాయమని అనుష్క తెలిపింది. దీని కోసం పోరాటం చేయడం కన్నా.. శక్తివంతమైన పాత్రలు ఎంచుకొని అందులో నటించి తమ ప్రతిభను చూపాలని అన్నారు. కాగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.