YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనా కాలంలో సంపాదించేశారు

కరోనా కాలంలో సంపాదించేశారు

ముంబై, మార్చి 6, 
కరోనా కష్టకాలంలోనూ మనదేశంలో 40 మంది బిలినియర్లుగా ఎదిగారు. గత ఏడాదిలోనే వీరంతా రూ.వంద కోట్లకుపైగా సంపాదించారు.  దీంతో మనదేశంలో బిలినియర్ల క్లబ్‌‌లోకి ప్రవేశించిన వారి సంఖ్య 177కు చేరింది. వీరిలో 1,2 ర్యాంకుల్లో అంబానీ, అదానీలు నిలిచారు. హురూన్‌‌ గ్లోబల్‌‌ రిచ్‌‌ ఇండెక్స్‌‌ ప్రకారం.. రిలయన్స్‌‌ బాస్‌‌ ముకేశ్ అంబానీ 83 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.6.09 లక్షల కోట్లు) సంపదతో మనదేశంలో అత్యంత సంపన్నుడిగా రికార్డును కొనసాగించారు.  ఆయన సంపాదన గత ఏడాది 24 శాతం పెరిగింది. అంతేగాక, ప్రపంచంలోని అత్యధిక సంపన్నుల్లో ఎనిమిదో వ్యక్తిగా నిలిచారు. అదానీ గ్రూప్‌‌ చైర్మన్‌‌, మరో గుజరాతీ గౌతమ్ అదానీ సంపద కూడా 2020 లో రెట్టింపు అయి దాదాపు 32 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.2.34 లక్షల కోట్లకు) చేరింది. గ్లోబల్‌‌ రిచెస్ట్ పీపుల్‌‌ క్లబ్‌‌లో ఆయన 20 స్థానాలు పైకి ఎదిగి ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో 48 వ వ్యక్తిగా మారారు. మనదేశంలో మోస్ట్‌‌ రిచెస్ట్ పర్సన్స్‌‌ లిస్టులో రెండోస్థానంలో నిలిచారు.  గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ నెట్వర్త్ 128 శాతం పెరిగి 9.8 బిలియన్ డాలర్లకు  (దాదాపు రూ.72 వేల కోట్లు) చేరుకుంది.  హురూన్‌‌ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనాస్ రెహ్మాన్ జునైద్ మాట్లాడుతూ అమెరికా, చైనాలో టెక్ కంపెనీల అధిపతులు సంపదను పెంచుకున్నారని, మనదేశంలో సంప్రదాయ, సైక్లికల్‌‌ ఇండస్ట్రీల అధిపతులు బిలినియర్లుగా ఎదుగుతున్నారని అన్నారు. .టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 197 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డు కొట్టారు. గత ఏడాది ఆయన సంపద 328 శాతం పెరిగింది. అమెజాన్ బాస్‌‌  జెఫ్ బెజోస్ 189 బిలియన్ డాలర్లతో రెండోప్లేసులో ఉన్నారు. ఫ్రెంచ్‌‌ ఫ్యాషన్ హౌస్ ఎల్‌‌వీఎంహెచ్‌‌ బాస్‌‌ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 114 బిలియన్ డాలర్ల సంపదతో మూడో ర్యాంకు సాధించారు. మైక్రోసాఫ్ట్‌‌ ఫౌండర్ బిల్‌‌గేట్స్‌‌, ఫేస్‌‌బుక్‌‌ సీఈఓ జుకర్‌‌బర్గ్‌‌ వరుసగా 4,5 ర్యాంకులు సాధించారు.ప్రపంచంలోని బిలినియర్లలో ఇండియన్ల సంఖ్య 209 కాగా, వీరిలో 177 మంది మనదేశంలో ఉంటున్నారు. గత ఏడాదిలో అమెరికా నుంచి 69 మంది బిలినియర్లు రాగా, భారత్‌‌లో 40 మంది ఈ క్లబ్‌లో చేరారు.ఐటీ కంపెనీ హెచ్‌‌సీఎల్‌‌ ఫౌండర్‌‌ శివ్ నాడార్ 27 బిలియన్ డాలర్ల సంపదతో (రూ.1.94 లక్షల కోట్లు) దేశంలోనే మూడో రిచెస్ట్‌‌ పర్సన్‌‌గా నిలిచారు. సాఫ్ట్‌‌వేర్ కంపెనీ స్కేలర్‌‌కు చెందిన జై చౌదరి సంపద 274 శాతం పెరిగి 13 బిలియన్ డాలర్లకు చేరింది. ఎడ్యుటెక్‌‌ బైజూస్‌‌ రవీంద్రన్  కుటుంబం సంపద 100 శాతం పెరిగి 2.8 బిలియన్ డాలర్లకుచేరుకుందిమహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా  కుటుంబం  సంపద కూడా100 శాతం పెరిగి  2.4 బిలియన్ డాలర్లకు చేరింది. పతంజలి గ్రూప్‌‌ కు చెందిన ఆచార్య బాలకృష్ణ సంపద 32 శాతం తగ్గి 3.6 బిలియన్ డాలర్లుగా రికార్డయింది.మహిళా ఇండస్ట్రియలిస్టుల్లో బయోకాన్‌‌కు చెందిన కిరణ్ మజుందార్ షా నెట్‌‌వర్త్‌‌ 4.8 బిలియన్ డాలర్లకు (41 శాతం పెరిగి) ఎగిసింది.  గోద్రేజ్‌‌కు చెందిన స్మితా కృష్ణ సంపద 4.7 బిలియన్ డాలర్లకు చేరింది ఫార్మా కంపెనీ లుపిన్‌‌కు చెందిన మంజు గుప్తా దగ్గరున్న సంపద 3.3 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లింది.

Related Posts