YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

అక్కినేని బయోపిక్

అక్కినేని బయోపిక్
ఒకవైపు టాలీవుడ్‌లో బయోపిక్స్ హడావుడి పతాక స్థాయికి చేరింది. సినీ, రాజకీయ ప్రముఖుల జీవితాల ఆధారంగా సినిమాలు రూపొందుతున్నాయి. ‘మహానటి’గా సావిత్రి బయోపిక్ వస్తుండగా, మరోవైపు ‘ఎన్టీఆర్’ రూపొందుతోంది. ఇంకోవైపు వైఎస్ జీవితంలోని కీలకమైన పాదయాత్ర పరిణామాలను ఆధారంగా చేసుకుని ‘యాత్ర’ రెడీ అవుతోంది.ఈ పరంపరలో మరో ప్రముఖుడి జీవిత కథ ఆధారంగా బయోపిక్ రాబోతోందని ప్రచారం ఊపందుకుంటోంది. ఇది మరెవరి విషయంలోనో కాదు అక్కినేని నాగేశ్వరరావు విషయంలో. అక్కినేని బయోపిక్ రానున్నదని, అందుకు ఇప్పటికే వర్క్ మొదలైనట్టుగా తెలుస్తోంది. తెలుగు చిత్రపరిశ్రమలో అక్కినేని ప్రస్థానం ఏమిటో వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి స్టార్ పై బయోపిక్ అంటే అది అమితాసక్తిని రేపుతుంది.ఏఎన్నార్ బయోపిక్‌ను రూపొందిస్తున్నది మరెవరో కాదు.. అక్కినేని కుటుంబీకులేనట. అధికారికంగా అనౌన్స్ చేయకుండా లోలోన పని చేస్తున్నారని, అన్ని ఏర్పాట్లూ అయ్యాకా అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. అక్కినేని పుట్టుక దగ్గర నుంచి ఆయన అంతిమయాత్ర వరకూ ఈ సినిమా ఉంటుందని, యంగ్ ఏఎన్నార్‌గా నాగచైతన్య, మిడిల్ ఏజ్ నుంచి అక్కినేని పాత్రలో నాగార్జున నటిస్తాడని కూడా అంటున్నారు. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించి రీసెర్చ్ జరుగుతోందట. ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Posts