YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ముత్తిరెడ్డి పైనే చర్చ

ముత్తిరెడ్డి పైనే చర్చ

నల్గొండ, మార్చి 5, 
ఆయన ఎక్కడుంటే అక్కడ ఆరోపణలు ఉంటాయో.. లేక ఆయనే వివాదాలు కోరుకుంటారో కానీ ఎప్పుడూ చర్చల్లో ఉంటారు. ఎమ్మెల్యే చర్యలు రచ్చ రచ్చకు దారితీస్తుంటాయి. జనగామ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కన్ను పడితే ఖాళీ జాగా అయినా.. కావాల్సిన భూమిలో అయినా క్షణాల్లో జెండా పాతేస్తారని ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వివాదమే మళ్లీ తాజాగా రాష్ట్రంలోనే సంచలనమైంది. సొంత పార్టీతోపాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్‌ టాపిక్‌గా మారింది.  గతంలో ప్రభుత్వ భూమిలో ప్రహారీగోడ కట్టడంతో దుమారం రేగింది. పోతారంలో ఒక కాలనీ వాసులు తమ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లపోడం వెనక ఎమ్మెల్యే అనుచరుల హస్తం ఉందన్నే ఆరోపణలు ఉన్నాయి. సొంత భూములకు ధరలు పెంచుకునేందుకు తాజాగా హరితహారం కార్యక్రమాన్ని వాడేకుసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు జనగామ జిల్లా నర్మెట్ట మండలం హన్మంతాపూర్‌ దగ్గర ముత్తిరెడ్డికి ఫామ్‌హౌస్‌ ఉంది. ఫామ్‌హౌస్‌కు వెళ్లేందుకు పక్కా రోడ్డు కూడా ఉంది. కానీ.. ఆ రోడ్డును విస్తరించాలనే ఆలోచన రాగనే రోడ్డుకు ఆనుకుని ఉన్న పొలాలపై కన్ను పడిందట. వన్‌ ఫైన్‌ మార్నింగ్‌ హరితహారం పేరు చెప్పి రోడ్డుకు అటూ ఇటూ 45 అడుగుల వరకు పొలాలను చదును చేయించి మొక్కలు నాటించారట.సాధారణంగా రోడ్డు విస్తరణకు ప్రైవేట్‌ భూములు తీసుకోవాలంటే నోటీసులు ఇస్తారు.. నోటిఫికేషన్లు జారీ చేస్తారు అధికారులు. ఈ ఎపిసోడ్‌లో అలాంటివి ఏమీ లేవట. నేరుగా జేసీబీలను తీసుకొచ్చి పని కానిచ్చేశారట. ఈ వివాదంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేరు రావడంతో ఎమ్మెల్సీ ఎన్నికల‌ వేళ మరోసారి రాజకీయవర్గాల్లో కలకలం రేగుతోంది. ప్రభుత్వ అధికారులు ఈ అంశంపై పెదవి విప్పడం లేదు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో బాధిత రైతులకు దిక్కుతోచడం లేదు. ప్రజలు తమకు కష్టం ఎదురైతే అధికారుల దగ్గరకు వెళ్తారు. అక్కడ న్యాయం జరగడం లేదని భావిస్తే ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తారు. ఇక్కడ బాధిత రైతులకు రెండుదారులు మూసుకుపోయాయని సమాచారం. అందుకే ప్రత్యామ్నాయాలపై ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. అధికార పార్టీలో మాత్రం జనగామలో అంతే అని చెవులు కొరుక్కుంటున్నట్టు సమాచారం.ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఎవరేమన్నా వాటిని తనదైన శైలిలో కొట్టిపారేస్తుంటారు ముత్తిరెడ్డి. తాజా ఎపిసోడ్‌లోనూ ఆయన రియాక్షన్‌ అదే. ఈ విషయంలో ఎమ్మెల్యే పాత్ర ఉందా లేదా అన్నది పక్కన పెడితే.. భూమిని ఆక్రమించాలంటే ఇలాక్కూడా చేయొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు జనం. ఈ వివాదం పై అధికార టీఆరెస్ వర్గాల్లోను‌ చర్చ జరుగుతుంది.
 

Related Posts