నూజివీడు మార్చి 6,
కృష్ణా జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లితండాల్లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో తెల్లవారుజామునుండే వేమిరెడ్డి పల్లితండాల్లో పోలీసులు జల్లెడ పట్టారు.10.లీటర్ల నాటు సారా స్వాధీనం,5.500లీటర్ల బెల్లం ఊటను డి.ఎస్.పి. బి. శ్రీనివాసులు నెలపాలు చేశారు.ఎవరైనా నాటుసారా తయారు చేసిన,విక్రయించిన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో నాటుసారా స్థావరాలపై దాడులు చేపడతామని డీఎస్పీ.బి .శ్రీనివాసులు తెలిపారు.