YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ 9 మంది నక్సల్స్ అరెస్టు మూడు రోజుల భారీ ఎన్‌కౌంటర్లో 37మంది నక్సలైట్లు మృతి

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ 9 మంది నక్సల్స్ అరెస్టు    మూడు రోజుల భారీ ఎన్‌కౌంటర్లో 37మంది నక్సలైట్లు మృతి

ఇటీవల వరుస ఎన్‌కౌంటర్లలో భారీగా నష్టపోయిన మావోయిస్టులకు మంగళవారం మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు 9 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. విస్తృత గాలింపుల్లో ఓ ప్లటూన్ కమాండర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై రూ.2 లక్షల మేర రివార్డు ఉన్నట్టు సమాచారం. కాగా మహారాష్ట్రలో మూడు రోజుల పాటు చోటుచేసుకున్న భారీ ఎన్‌కౌంటర్లో 37మంది నక్సలైట్లు మృతిచెందారు. పదహారుమంది మావోయిస్టులు మృతికి కారణమైన ఎన్‌కౌంటర్ జరిగిన కొద్ది గంటల్లోనే అహేరీ తాలూకా రాజారాంఖన్లా అటవీప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు నక్సల్స్ హతమయ్యారు. సోమవారం రాత్రి ఏడు-ఎనిమిది గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. మృతుల సంఖ్యను ఎఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. మృతుల్లో దామన్ దళ కమాండర్ నందు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. ఆదివారం నాటి ఎన్‌కౌంటర్‌లో కొందరు తప్పించుకున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తున్నారు. సోమవారం నాటి ఎన్‌కౌంటర్‌లో గడ్చిరోలి ఎలైట్ పోలీస్ సీ60కమాండో యూనిట్‌కు చెందిన.. స్థానిక గిరిజనులు అధికంగా ఉండే 64మంది సభ్యుల బృందం పాల్గొన్నది. తాజా ఘటనతో గడిచిన ఐదు నెలల్లో నలుగురు డివిజనల్ కమిటీ సభ్యులు హతమయ్యారు. రఘు అలియాస్ నద్దెల సైలు అనే ఒకే ఒక సభ్యుడు మిగిలాడని పోలీసులు తెలిపారు.రఘు భార్య అఖిల ఆదివారంనాటి ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది. ఇదిలాఉంటే.. గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్ జరిగిన కొద్దిగంటలకే అదేరోజు అర్ధరాత్రి ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురుమావోయిస్టులు చనిపోయారని వా ర్తలొస్తున్నాయి. రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరంచేసిన పోలీసులకు ఆదివారం రాత్రి సుక్మా సబ్‌డివిజన్ పరిధిలోని పూసపాల అటవీ ప్రాం తంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారం అందింది. ఆ ప్రాంతంలో మోహరించిన పోలీసు బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. రెండున్నర గంటలపాటు భీకరకాల్పులు జరిగినట్టు తెలిసింది. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారని వార్తలు వచ్చాయి. ఈ విషయమై సుక్మా జిల్లా అదనపు ఎస్పీ శలభ్‌కుమార్ సిన్హాను నమస్తే తెలంగాణ వివరణ కోరగా.. పూసపాల అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు వాస్తవమేననిఅయితే ఈ ఘటనలో మావోయిస్టుల మృతిపై ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు.

Related Posts