అమరావతి మార్చి 6,
కరోనా సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు ఆర్థికంగా ప్రభుత్వం అండగా ఉందని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు.బ్యాంకుల తోడ్పాటుతో రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి పురోగతి సాధిస్తుందని,పారిశ్రామిక కారిడార్లు, పారిశ్రామిక పార్కులు, పోర్టులు, ఎయిర్ పోర్టుల వంటి మౌలిక వసతుల కల్పనలో మరింత సాయాన్ని అందిస్తామని చెప్పారు.వైద్య, వ్యవస్థాపక నిర్మాణాలకు పెద్దపీట వేయడంలో సహకారమందించాలని అన్నారు. నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధిలో మరింత తోడ్పాటునివ్వాలని సూచించారు.'అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో నిధుల సమీకరణ, వాణిజ్య అవకాశాలకు సంబంధించిన వర్చువల్ సదస్సులో మల్టీ లేటరల్ బ్యాంకులకు పిలుపునిచ్చిన మంత్రి మేకపాటి .. తుపానుల సమయంలో అందించిన తోడ్పాటు మరవలేనిదని అన్నారు.సుస్థిర అభివృద్ధి, ఆర్థిక, పారిశ్రామిక వృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెంపులో బ్యాంకుల సహకారం ఎంతైనా అవసరం ఉందని,దేశవ్యాప్తంగా అభివృద్ధిలో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, ఏఐఐబీ, ఎన్డీబీ బ్యాంకుల భాగస్వామ్యం కావాలని అన్నారు.