YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

ఆ ఐదు రాష్ట్రాల్లో పెరుగుతున్న క‌రోనా కొత్త కేసుల సంఖ్య

ఆ ఐదు రాష్ట్రాల్లో పెరుగుతున్న క‌రోనా కొత్త కేసుల సంఖ్య

న్యూఢిల్లీ మార్చ్ 6 
‌దేశంలో క‌రోనా కొత్త కేసుల సంఖ్య క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతూనే ఉన్న‌ది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌, పంజాబ్‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య భారీ ఉంటున్న‌ది. గ‌డిచిన 24 గంట‌ల్లో కూడా ఆ ఐదు రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు న‌మోద‌య్యాయి. శుక్ర‌వారం దేశ‌వ్యాప్తంగా న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల్లో కేవ‌లం పై ఐదు రాష్ట్రాల్లో న‌మోదైన కేసులే 82 శాతం ఉన్నాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ వెల్లడించింది. మ‌హారాష్ట్ర‌లో అత్య‌ధికంగా 10,216 కేసులు న‌మోదు కాగా, ఆ త‌ర్వాత అత్య‌ధికంగా కేర‌ళ‌లో 2,776 కొత్త కేసులు న‌మోదైన‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది.క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌ను కూడా అధికారులు వేగ‌వంతం చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 22,06,92,677 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా, అందులో శుక్ర‌వారం ఒక్క‌రోజే 7,51,935 మందికి క‌రోనా పరీక్ష‌లు జ‌రిపిన‌ట్లు ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ తెలిపింది. 

Related Posts