YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తా.. ఆడియో క్లిప్ వైరల్ వలపన్ని పట్టుకున్న కొయంబత్తూరు పోలీసులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తా.. ఆడియో క్లిప్ వైరల్      వలపన్ని పట్టుకున్న కొయంబత్తూరు పోలీసులు
 ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తా  అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఆడియో క్లిప్ విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఆడియో సంభాషణపై దర్యాప్తు చేసి, మాట్లాడిన వ్యక్తిని అతడు 1998 కొయంబత్తూరు పేలుళ్లలో దోషిగా తేలాడు. కఠిన కారాగార శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలయ్యాడు. మళ్లీ అరాచకం సృష్టిస్తానంటూ కలకలం రేపి కటకటాల వెనక్కి వెళ్లాడు. కొయంబత్తూరు పోలీసులు మహ్మద్ రఫీక్ అనే వ్యక్తిని వలపన్ని పట్టుకున్నారు.అతన్ని  అదుపులోకి తీసుకునేందుకు కొయంబత్తూరు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆడియోలో ఎనిమిది నిమిషాల పాటు కొనసాగిన సంభాషణ ఆధారంగా... మాట్లాడుతున్నది మహ్మద్ రఫీక్‌ అని పోలీసులు పసిగట్టారు. ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్ ప్రకాశ్‌తో అతడు మాట్లాడినట్టు గుర్తించి హుటాహుటిన అదుపులోకి తీసుకున్నారు.ఈ సంభాషణ ప్రధానంగా వాహనాల లావాదేవీల గురించి సాగింది. అయితే ఉన్నట్టుండి రఫీక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేయాలనుకుంటున్నాం. 1998లో అద్వానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా బాంబులు పెట్టామో, మళ్లీ అదే విధంగా విధ్వంసం సృష్టిస్తాం. అని అతడు పేర్కొన్నట్టు పోలీసులు వెల్లడించారు. తన మీద చాలా కేసులు ఉన్నాయనీ.. దాదాపు 100కు పైగా వాహనాలను ధ్వంసం చేశానని రఫీక్ సదరు కాంట్రాక్టర్‌తో చెప్పినట్టు తెలిపారు. 1998 ఫిబ్రవరిలో జరిగిన వరుస పేలుళ్లలో 58 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. ఈ కేసులో జైలు శిక్ష అనుభవించి విడుదలైన మహ్మద్ రఫీక్ ప్రస్తుతం కొయంబత్తూరు లోని కునియముత్తూర్‌లో నివసిస్తున్నాడు.

Related Posts