ముంబాయి మార్చ్ 6 భారత మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసి నేటికి 50 ఏండ్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆయన్ను సత్కరించింది. ప్రస్తుతం కామెంటేటర్‌గా చేస్తున్న సునీల్‌కు బీసీసీఐ ఇవాళ ప్రత్యేక జ్ఞాపికను అందజేసింది. టీమిండియా తరపున 50 ఏండ్ల క్రితం సరిగ్గా ఈ రోజున సునీల్ గవాస్కర్ టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. బీసీసీఐ కార్యదర్శి జే షా ఈ నేపథ్యంలో ఇవాళ మొతేరా స్టేడియంలో గవాస్కర్‌ను సన్మానించారు. ప్రత్యేక బ్లూ కలర్ క్యాప్‌ను గవాస్కర్‌కు అందజేశారు. టెస్ట్ క్రికెట్‌లో సునీల్ గ్రేటెస్ట్ ఓపెనర్‌గా నిలిచాడు. టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని దాటిన తొలి క్రికెటర్ గవాస్కరే. మొత్తం 125 టెస్టులు ఆడిన సునీల్.. 10122 రన్స్ చేశాడు. 236 నాటౌట్ అత్యధిక స్కోర్. గవాస్కర్ టెస్ట్ క్రికెట్‌లో 34 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.