హైదరాబాద్ మార్చ్ 6 ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి(పీఏ)ని అంటూ మోసాలకు పాల్పడుతున్న రంజీ మాజీ క్రికెటర్ నాగరాజును హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ఆస్పత్రులకు నాగరాజు ఫోన్ చేసి డబ్బు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎల్బీ స్టేడియంలో కటౌట్లు పెట్టాలని.. 9 కంపెనీల నుంచి రూ. 39.22 లక్షలు వసూలు చేశాడు నాగరాజు. వెబ్‌సైట్లలో కంపెనీలు, ఆస్పత్రుల ఫోన్ నంబర్లు సేకరించి ఈ మోసాలకు పాల్పడ్డాడు. నిందితుడి నుంచి రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నాగరాజుపై 10 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 2014-16 వరకు ఆంధ్రప్రదేశ్ నుంచి రంజీ మ్యాచ్‌ల్లో నాగరాజు ఆడాడు. నాగరాజు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా యవ్వారిపేట గ్రామం.