YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కాసులు కురిపిస్తున్న పుచ్చకాయలు

కాసులు కురిపిస్తున్న పుచ్చకాయలు

కడప, మార్చి 8, 
ఈ ఏడాది సాగు చేసిన పుచ్చకాయల పంట ఆశలు నింపుతోంది, సీజనుకావడంతో నియోజకవర్గ పరిధిలో సుమారు 627.4హెక్టార్లలో కళింగర పంట సాగవుతున్నట్లు ఉద్యానశాఖ అధికారులు వెల్లడించారు. ఆ మేరకు చక్రాయపేట మినహా మిగిలిన ఆరు మండలాల్లో సాగు చేసిన కళింగర పంట రైతన్నకు ఊతమిస్తోంది. ఈ దఫా వైరస్‌ గండం కూడా తప్పినట్లు రైతులు తెలిపారు. అదీగాక కృష్ణాజలాలు అందుబాటులో ఉండటంతో సాగు విస్తీర్ణం కూడా కాస్త పెరిగినట్లు తెలుస్తోంది. ఇది వరకు నియోజకవర్గ వర్గ పరిధిలో 300హెక్టార్లలో మాత్రమే సాగు కన్పించేంది. ప్రస్తుతం 600పైచిలుకు హెక్టార్లలో సాగు ఉందంటే వందకు పైబడి హెక్లార్లలో కళింగర సాగు విస్తీర్ణం పెరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ ధర టన్ను రూ.6వేల నుంచి రూ.8వేల వరకు పలుకుతున్నటు రైతులు చెబుతున్నారు. దిగుబడి ఇంటికి చేరి కనీసం మద్దతు ఉండే వరకు సాగు ఉంటుందో లేదోనని వారు ఆందోళన చెందుతారు. ఆశించిన ధర లభిస్తే కాస్త కుదుటపడతారు. లేదంటే కష్టాలు కన్నీళ్లుదిగమింగుకోవాల్సి వస్తుంది. అన్నదాతను ఏదో ఒక రూపంలో కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. వర్షాభావ పరిస్థితులు, కరువు ఇవన్నీ చాలవన్నట్లు వైరస్‌ మహమ్మారి వంటి వైపరీత్యాలు అన్నదాతను అతలాకుతలం చేస్తాయి. అయితే అన్నిటికీ ఎదురొడ్డి సాగులో సామర్థ్యం చూపించగల సత్తా రైతుకు ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కళింగర సాగుపై రైతులు దృష్టి సారించారు. వేసవిలో కళింగరకు గిరాకీ ఉంటుంది. సుదూర ప్రాంతాలకు కూడా కళింగర కాయలను ఎగుమతి చేస్తారు. ఇక్కడ పండించిన కళింగర కాయలకు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ కూడా ఉంటుంది. ఈ లక్ష్య సాధనంలో కళింగర రైతులు శ్రమను దారబోస్తారు. పులివెందుల నియోజకవర్గ పరిధిలో పుచ్చయల కా సాగు గురించి ఉద్యానశాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి పలు విషయాలు వెల్లడించారు. చక్రాయపేట మినహా మిగిలిన ఆరు మండలాల్లో కళింగర సాగవుతోందన్నారు. పులివెందుల మండల పరిధిలో 98.1హెక్టార్లు, లింగాలలో 303.5హెక్టార్లు, సింహాద్రిపురంలో 11.2హెక్టార్లు, తొండూరులో 136.4హెక్టార్లు, వేంపల్లెలో 6.2హెక్టార్లు, వేముల మండలంలో 71.6హెక్టార్ల చొప్పున సాగవుతోందని చెప్పారు. ఇక పెట్టుబడి ఖర్చుల విషయానికి వస్తే కళింగర విత్తనాల ధర ప్యాకెట్‌ రూ.25వేలు అని ఇందులో ఆరెకరాలకు సగం ప్యాకెట్‌ విత్తనాలతో రైతులు సాగు చేస్తారని పేర్కొన్నారు. అంటే రూ.12500 చొప్పున విత్తనాలను కొనుగోలు చేస్తారన్నారు. ఎకరాకు సాగు ఖర్చు మొత్తం రూ.50వేల నుంచి రూ.60వేల వరకు వస్తుందని వెల్లడించారు. 70నుంచి80రోజుల వ్యవధిలో కళింగర కాయలు కోత మొదలవుతాయన్నారు.. సస్యరక్షణ చర్యలు తప్పక పాటించాల్సి ఉందని, నీటి వసతి ఆధారంగా కనీసం వారానికి ఒక సారి తడి అందించాల్సి ఉందని పేర్కొంటున్నారు. అన్ని అనుకూలిస్తే ఎకరాకు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు రాబడి రావచ్చని రైతులు చెబుతున్నారు. ఈ లెక్కన సాగు ఖర్చు బేరీజు వేసుకుంటే రైతుకు ఆదాయమే లభిస్తుందని చెప్పవచ్చు. పంట పూర్తి దిగుబడి వరకు ఆశాజనకంగా ఉంటే రైతుకు ఊరట లభిస్తుంది. ఈ దఫా వైరస్‌, చీడల ప్రభావం పెద్దగా చూపకపోవడం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కళింగర రైతుకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే సీజను ముగిసే వరకు మరింత ఎక్కువ గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.

Related Posts