YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆరు నియోజకవర్గాల్లో జీరో..

ఆరు నియోజకవర్గాల్లో జీరో..

తిరుపతి, మార్చి 8, 
పంచాయ‌తీలు అంటే న‌గ‌ర ప్రాంతంలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కాక‌పోయినా, ప‌ల్లె ప్రాంతాల్లో ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో 50 నుంచి 100 కు పైగా పంచాయ‌తీలు ఉంటాయి. ప్రతిప‌క్షంగా ఉన్న పార్టీ ఎంత ఘోరంగా ఓడినా ఏ డ‌బుల్ డిజిట్ లో లేదా క‌నీసం హీన‌ప‌క్షంలో సింగిల్ డిజిట్ లో అయినా త‌మ మ‌ద్దతుదారులు పాగా వేసేలా చేస్తుంది. స్థానిక నాయ‌క‌త్వం ఎంత బ‌ల‌హీనంగా ఉన్నా త‌క్కువలో త‌క్కువ సింగిల్ డిజిట్ పంచాయ‌తీలు అయినా గెల‌వ‌డం కామ‌న్‌. అంత‌కు మించిన హీన‌ప‌క్షం ఎక్కడా ఉండ‌దు. అయితే ఏపీలో నాలుగు విడ‌త‌లుగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో మాత్రం విప‌క్ష టీడీపీకి ఓవ‌రాల్‌గా ఘోర ప‌రాభ‌వం ఎదుర‌వ్వడం ఒక దెబ్బ అయితే.. ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నీసం త‌మ మ‌ద్దతుదారుల‌తో ఖాతా కూడా తెరిపించుకోలేక‌పోయింది.గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో 23 అసెంబ్లీ సీట్లతో స‌రిపెట్టుకున్న టీడీపీ ఈ 20 నెల‌ల్లో ప‌లు చోట్ల మ‌రింత దిగ‌జారింది. చివ‌ర‌కు ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఒక స‌ర్పంచ్ స్థానం కూడా గెలిపించు కోలేనంత దీన‌స్థితికి దిగ‌జారింది. ఈ ఆరు నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నీసం ఒక్కటంటే ఒక్క స‌ర్పంచ్ స్థానం కూడా టీడీపీకి రాలేదు. మంత్రి పెద్దిరెడ్డి రామంచ‌ద్రారెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న పుంగ‌నూరులో 85 స‌ర్పంచ్ స్థానాల‌కు 85 వైసీపీకి ఏక‌గ్రీవం చేసే వ‌ర‌కు ఆయ‌న నిద్రపోలేదు. ఇక విప్ పిన్మెల్లి రామ‌కృష్ణా రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మాచ‌ర్లలో 80 కు పైగా స్థానాల‌కు కేవ‌లం మూడు చోట్ల మిన‌హా అన్ని చోట్ల వైసీపీకి ఏక‌గ్రీవం కాగా.. ఎన్నిక‌లు జ‌రిగిన ఆ మూడు చోట్ల కూడా వైసీపీ మ‌ద్దతుదారులే గెలిచారు.ఇక ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం మొత్తం మీద 85 పంచాయ‌తీలకు టీడీపీ ఓ ఏడెనిమిది చోట్ల నామినేష‌న్లు వేసి పోటీ చేయ‌గా.. ఒక్క చోటా గెల‌వలేదు. ఎంత ఘోరం అంటే ఈ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం మీద కేవ‌లం ఆరు వార్డులు మాత్రమే టీడీపీ గెలిచింది. ఇక జ‌మ్మల‌మ‌డుగు అన్న నియోజ‌క‌వర్గం ఒక‌టి ఉంద‌న్న విష‌య‌మే చంద్రబాబు కు గుర్తున్నట్టు లేదు. పార్టీ అధికారంలో ఉండ‌గా ఇద్దరు మాజీ మంత్రులు ఆదినారాయ‌ణ రెడ్డి, రామ సుబ్బారెడ్డి ఇద్దరూ చంద్రబాబును వాడుకున్నారు. ఇప్పుడు అక్కడ పార్టీకి ఓ నాయ‌కుడిని నిల‌బెట్టే ప‌రిస్థితి కూడా బాబుకు లేదు. చాలా చోట్ల టీడీపీకి పోటీ చేసే దిక్కు లేక ఆదినారాయ‌ణ రెడ్డి నిల‌బెట్టిన బీజేపీ వాళ్లకు స‌పోర్ట్ చేశారు.ఇక నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం సంగం కార్పొరేష‌న్లో ఉండ‌గా.. గ్రామీణ ప్రాంతంలో ఉన్న చోట్ల ఒక్క పంచాయ‌తీ కూడా వ‌ద‌ల‌కుండా గెలిపించుకున్నారు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి. అనంతపురం నియోజ‌క‌వ‌ర్గంలోని గ్రామీణ పంచాయ‌తీ ప్రాంతాల్లోనూ ఒక్కటంటే ఒక్క పంచాయ‌తీ కూడా టీడీపీ మ‌ద్దతుదారులు గెల‌వ‌లేదు. ఇక మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ సింగిల్ డిజిట్‌కే ప‌రిమిత‌మైంది. అందులో చంద్రబాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం చంద్రగిరి కూడా ఉంది. దీనిని బ‌ట్టి టీడీపీకి చాలా చోట్ల గ్రామస్థాయిలో ప‌ట్టు స‌డలిపోతోంది. అధికార పార్టీని ఎదుర్కొనే ద‌మ్మున్న నేత‌లు ఉన్న చోట ప‌ర్వాలేద‌నిపిస్తోన్న మిగిలిన చోట్ల ఘోర ప‌రాజ‌యాలు మూట‌క‌ట్టుకుంటోంది. రేపు ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లోనూ అదే ప‌రిస్థితి పున‌రావృతం అయితే టీడీపీకి బ‌ల‌మైన కేడ‌ర్ కూడా దూర‌మ‌య్యే ప్రమాదం ఉంది.

Related Posts