YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

వచ్చే యాసంగిలో ఎస్సారెస్పీ కాల్వల్లో నీళ్లు - నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

వచ్చే యాసంగిలో ఎస్సారెస్పీ కాల్వల్లో నీళ్లు - నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
వచ్చే యాసంగిలో ఎస్సారెస్పీ కాల్వల్లో నీళ్లు పారించి సూర్యపేట, తుంగతూర్తి నియోజకవర్గాలకు నీరిస్తామన్నారు మంత్రి హరీశ్‌రావు. పెన్‌పహాడ్ మండలం భక్తలాపురం దగ్గర శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ పనులను మంగళవారం మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎంపీలు గుత్తా సుఖెందర్‌రెడ్డి, బూర నర్సయ్య, లింగయ్య యాదవ్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... ఎస్సారెస్పీ ఫేజ్-2 పనుల్లో వేగం పెరిగింది. కాళేశ్వరం నీళ్లతో పాటు ఎస్సారెస్పీ జలాలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పారుతాయని వెల్లడించారు.
అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ... గత ప్రభుత్వాల హయాంలో ఎస్సారెస్పీ కాల్వల్లో అవినీతి పారింది. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయి కాల్వల్లో కంపచెట్లు మొలిచాయి. కాంగ్రెస్ హయాంలో ఫేజ్ -2 పనుల్లో అడుగడుగునా అవినీతి జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వలకు మహర్దశ వచ్చింది. అన్ని పెండింగ్ పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం. గతంలోనే ఎస్సారెస్పీ కాల్వల ద్వారా చెరువులను నింపాం. వచ్చే యాసంగీలో ప్రాజెక్టు చివరి భూములకు నీరందిస్తామని హామి ఇచ్చారు.

Related Posts