YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వెంటిలేటర్ పై సర్కార్

వెంటిలేటర్ పై సర్కార్

హైదరాబాద్, మార్చి 8, 
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కోట్లల్లో నిధులు మంజూరు చేసిన వాటిని ముఖ్యమంత్రి పక్కదారి పట్టిస్తున్నారని, అన్ని తామే చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వెంటిలేటర్‌పై ఉందని.. అది ఎప్పుడైనా కూలిపోవచ్చని సంజయ్‌ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించేందుకు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, యువతన భయపెట్టిస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయంలో గెలిచే స్థానాలన్నీ తమ కుటుంబ సభ్యులు, తనకు కావాల్సిన వారికిస్తారని, కచ్చితంగా ఓడిపోతారని తెలిసి కూడా ఈ స్థానాన్ని పీవీ కుటుంబానికి ఇచ్చి వారి కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలన్నా.. వారికి గద్దె దించాలన్నా అది బీజేపీతోనే సాధ్యమన్నారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న అక్రమాలు, అవినీతి ప్రజల ముందుకు తెస్తామని ఆయన అన్నారు.ఎన్నికల్లో హామీల వర్షం గుప్పించడం ఆ తర్వాత కనిపించకుండా పోవడం టీఆర్‌ఎస్‌ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యఅని బండి సంజయ్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి నిధులు కేటాయించుకొని ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తే ఊరుకోబోమని వారికి ధైర్యన్ని ఇచ్చి వెన్నుంటామన్నారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఇలా వరసగా బీజేపీ గెలుపు బాటలో ఉందని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మునుగుతున్న పడవ అని దీన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించాలన్నారు.

Related Posts