YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

హైదరాబాద్ నుంచి బెంగాల్ కు అసద్

హైదరాబాద్ నుంచి బెంగాల్ కు అసద్

హైదరాబాద్, మార్చి 8, 
పశ్చిమ బెంగాల్ లోనూ మజ్లిస్ జెండా ఎగురవేయాలని అసదుద్దీన్ ఒవైసీ తహతహలాడుతున్నారు. బీహార్ లో లభించిన విజయం తో అసదుద్దీన్ మంచి ఊపు మీద ఉన్నారు. బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం ఐదు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. దీంతో అసదుద్దీన్ ఒవైసీ అనుకున్నట్లు పశ్చిమ బెంగాల్ లోనూ ఎంఐఎం ప్రభావం చూపే అవకాశముంది. పశ్చిమ బెంగాల్ లో ముస్లిం సామాజికవర్గం ఎక్కువగా ఉండటం కలసి వచ్చే అంశంగా చూస్తున్నారు.బెంగాల్ లో దాదాపు 30 శాతం ముస్లిం ఓటు బ్యాంకు ఉంది. వీరంతా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. అయితే అసుదుద్దీన్ ఒవైసీ పోటీకి దిగుతానని ప్రకటించడంతో ఆ ఓటు బ్యాంకు ఎటువైపు టర్న్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అసదుద్దీన్ ఒవైసీ కోల్ కత్తాలో పర్యటించారు. ముస్లిం జనాభఆ ఎక్కువగా ఉన్న మెటియాబృజ్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.ఇప్పటికే బెంగాల్ లో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ తో పార్టీ ఉంది. దీనికి అబ్బాస్ సిద్దిఖీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన మైనారిటీ నేతలు ఇప్పటికే హైదరాబాద్ వచ్చి అసదుద్దీన్ ఒవైసీతో భేటీ అయ్యారు. ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలున్నదానిపై అసద్ వారితో చర్చించారు. నియోజకవర్గాలుగా బలాబలాలను అసద్ అడిగి తెలుసుకున్నారు. దాదాపు 60 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అసదుద్దీన్ భావిస్తున్నారు.అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎంకి బీజేపీ బీ పార్టీగా ముద్రపడింది. బీజేపీని గెలిపించడం కోసమే ముస్లిం ఓటు బ్యాంకును చీల్చేందుకు అసదుద్దీన్ ఎన్నికల బరిలోకి అభ్యర్థులను దింపుతున్నారని విమర్శలున్నాయి. ఆర్థికసాయం కూడా ఎవరందిస్తున్నారో తెలుసునని బీహార్ ఎన్నికల ఫలితాల తర్వాత అనేక రాజకీయ పక్షాలు విమర్శలకు దిగాయి. దీంతో అసదుద్దీన్ పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీతో పొత్తు పెట్టుకోవాలని భావించారు. ఈ మేరకు సంకేతాలు కూడా పంపారు. అయితే మమత బెనర్జీ దీనికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ తో పొత్తుకు సిద్ధమయ్యారు. అయితే బెంగాల్ ముస్లింలు బెంగాలీయే మాట్లాడతారని, అసద్ మాయలో పడరని టీఎంసీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Posts