YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

తలసాని రంగనాయక సాగర్ టన్నెల్ టూర్ సిద్ధిపేట

తలసాని రంగనాయక సాగర్ టన్నెల్ టూర్ సిద్ధిపేట
కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుత కళా ఖండం అని ఆసియాలోనే ఏ ప్రభుత్వాలు ఇలాంటివి నిర్మించలేదని, అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టులపై ప్రజంటేషన్ చేస్తే సినిమా చూపిస్తున్నారని, అమలు అవుతాదా? అని అన్నారు. కానీ ఇప్పుడది నిజం కాబోతున్నదని తెలంగాణ పశు సంవర్థక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్ధిపేట జిల్లాలోని చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ రంగనాయక సాగర్ ను సోమవారం రాత్రి రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ మేరకు 11వ ప్యాకేజీ రంగనాయక సాగర్ ప్రాజెక్టు టన్నెల్ సొరంగంలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటగా సర్జికల్ పూల్, ఆ తర్వాత పంప్ హౌస్ పనులు పరిశీలించి పనుల వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కోటి ఎకరాల మాగాణి తెలంగాణ కావాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని గత పాలకులకు తెలంగాణ బాగోగులు పట్టలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇస్తున్నామని తెలిపారు. 71 ఏళ్ల స్వాతంత్ర్య చరిత్రలో రైతే రాజు అని మాట్లాడిన వారెవరూ నిజంగా రైతుల సంక్షేమానికి పాటుపడిన దాఖలాలు లేవని, కానీ దానిని నిరూపించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని, నాయకుడు అనే వాడికి ఒక కల్పన ఉండాలి, దాన్ని సాధించే సంకల్పం ఉండాలి. ఇవి రెండూ ఉన్న ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని, 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది., కానీ తెలంగాణలో వెనుకబడిన పీడిత, బడుగు, బలహీన వర్గాలకు కేసీఆర్ సీఎం అయ్యాకే నిజమైన స్వాతంత్ర్రం వచ్చిందన్నారు.  కాంగ్రెస్ బస్సు యాత్ర ఒక పిక్నిక్ లా జరుగుతున్నదని ఆరోపించారు
కాంగ్రెస్ పార్టీ పాలించినట్ల మేము పాలించబోమని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తామని పేర్కొంటూ.., కాంగ్రెస్ పార్టీ 32 మందితో చేపట్టిన బస్సు యాత్రను ఉద్దేశించి ఆ బస్సులో 22 మంది ముఖ్యమంత్రులు కావాలని కోరడం, చివరికి బస్సు నడిపే డ్రైవర్ కూడా సీఏం పదవి కావాలని అడిగారని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. ఇంత సిగ్గుమాలిన పని ఇక్కొక్కటి లేదని కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై మండి పడ్డారు మీ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదా.. అని గడ్డాలు, మీసాలు పెంచడం కాదంటూ జానారెడ్డి, ఉత్తమ్ లకు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా సరే., మీకు ధైర్యం ఉంటే చెప్పండి. మేము అక్కడికి వస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత పాలకుల హయాంలో పనులు జరగలేదు అని తెలిపారు.
మంత్రి వెంట ఎంపీ బండ ప్రకాశ్, రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖ సువర్ణ, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మంజూరాణి, విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మలా, వివిధ శాఖలకు చెందిన అధికారిక యంత్రాంగం, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts