YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

సుప్రీంకోర్టుకు ఎల్లప్పుడూ స్త్రీత్వంపై అత్యున్నత గౌరవం: చీఫ్ జస్టిస్ బొబ్డే

సుప్రీంకోర్టుకు ఎల్లప్పుడూ స్త్రీత్వంపై అత్యున్నత గౌరవం: చీఫ్ జస్టిస్ బొబ్డే

సుప్రీంకోర్టుకు ఎల్లప్పుడూ స్త్రీత్వంపై అత్యున్నత గౌరవం: చీఫ్ జస్టిస్ బొబ్డే
న్యూఢిల్లీ మార్చ్ 8
నిందితుడి న్యాయవాదికి అడిగిన ప్రశ్నలు ఆ కేసులోని వాస్తవాలలో ఉన్నాయని, అయితే మీడియాలో తప్పుగా నివేదించడం జరిగిందని బొబ్డే అభిప్రాయపడ్డారు. ఒక సంస్థగా సుప్రీంకోర్టుకు ఎల్లప్పుడూ స్త్రీత్వంపై అత్యున్నత గౌరవం ఉన్నదని చీఫ్ జస్టిస్ ఎస్‌ఐ బొబ్డే సోమవారం అన్నారు. గత వారం లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని ఫిర్యాదుదారును వివాహనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అంటూ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించినట్లు అన్ని మీడియాలో వార్తలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. ‘ఒక సంస్థగా, ఈ కోర్టులోని ధర్మాసనానికి మహిళలు అంటే అత్యన్నత గౌరవం ఉన్నది. మహిళలను సుప్రీంకోర్టు ఎప్పుడూ సముచితంగా గౌరవిస్తున్నది. ఫిర్యాదుదారును వివాహం చేసుకోవాలని నిందితుడిని నేను అడగలేదు. అయితే, ఆమెను పెండ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అని మాత్రమే ప్రశ్నించాం. అసలు విషయాలు ఇలా ఉండగా మీడియాలో అందుకు విరుద్ధంగా వార్తలు ప్రచురితమయ్యాయి’ అని సీజేఐ బొబ్డే పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై న్యాయవాదుల నుంచి, హక్కుల సంఘాల నుంచి విమర్శలు రావడంతో వివాదంపై జస్టిస్ బొబ్డే స్పందించారు. విచారణ సందర్భంగా హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీజేఐకి మద్దతుగా నిలిచారు. మార్చి 1 న విచారణ సందర్భంగా కోర్టు సమర్పించిన సాక్ష్యం ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 165 ప్రకారం పూర్తిగా సమకాలీనంగా ఉన్నదని, ఇది ఒక కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నిందితులను ప్రశ్నించేందుకు న్యాయమూర్తులకు అధికారం ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. న్యాయమూర్తులు ఈ కేసులో అలా ప్రశ్నించడం సబబుగానే ఉన్నదని, అయితే వ్యాఖ్యలు సందర్భోచితంగా విస్తృతంగా నివేదించబడ్డాయని మెహతా చెప్పారు.

Related Posts