YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

ఆరు నెలల్లో ఎయిమ్స్ : మంత్రి లక్ష్మారెడ్డి

ఆరు నెలల్లో ఎయిమ్స్ :  మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ లో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఏఎంజీ బ్లాక్, మెడిసిన్ డిస్పెన్సరీ, లైబ్రరీ భవనం, అడిటోరియం లను అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. సాధించిన తెలంగాణలో అభివృద్ధిని కూడా అదే పోరాట ఉద్యమ స్ఫూర్తి తో చేసుకుంటున్నామని అన్నారు. నాటి ఉద్యమ నేత కేసీఆర్ సీఎం కావడం మన అదృష్టం. గతానికి పూర్తి భిన్నంగా, రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ రూపు రేఖలు మార్చేశాం. ఆధునీకరించాం. అత్యాధునిక పరికరాలు ఇచ్చాం. అధునాతన రోగ నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్ లు ఏర్పాటు చేశామని అన్నారు. 20 ఐసీయూలు, , 40 డయాలిసిస్ సింటర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ మహా నగరంలోని బస్తీల్లో వెయ్యి బస్తీ దవాఖానాలు పెడుతున్నాం. వైద్య పరంగా గతంలో ఎన్నడూ లేనంత గా అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. కేంద్ర నిధులు వీలైనంత రావడానికి ప్రయత్నిస్తున్నాం. ఎయిమ్స్ ని రాష్ట్రానికి తేగలిగాం. 6 నెలల్లో ఎయిమ్స్ ప్రారంభం కావడానికి ప్రయత్నిస్తున్నాం. సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ఫలించాయి. ఇందుకు సహకరించిన కేంద్రానికి కృతజ్ఞతలని అన్నారు. యాదృచ్చికంగా రేపు ప్రపంచ మలేరియా డే. ఈ రోజు ఫీవర్ హాస్పిటల్ లో ఆధునిక వసతుల కల్పన జరిగింది. ఏజెన్సీలల్లో విష జ్వరాలు అదుపు చేయగలిగామన్నారు. వైద్యం అందకుండా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. అందరికి కంటి పరీక్షలు చేయబోతున్నాం. అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయనున్నాం. ప్రతి ఏడాది ఈ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా అందించనున్నామని తెలిపారు. వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించడం, చికిత్స అందించడం అనే దశలుగా ప్రభుత్వం పని చేస్తున్నది. సమగ్ర సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రభుత్వం పని చేస్తున్నది. ప్రభుత్వ పథకాలు కూడా సంపూర్ణ ఆరోగ్య దిశగా అమలు అవుతున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరిత హారం వంటి పథకాలు అన్ని సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడే పథకాలే నని అన్నారు. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతై ఫీవర్ హాస్పిటల్ లో మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని అన్నారు. ఫీవర్ హాస్పిటల్ చాలా పురాతనమైన దవాఖానా ప్రతి దవాఖానా లో మంచి నీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మ్మెల్సి ఎంఎస్ ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి వచ్చిన తరువాత ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్రం నాలుగు ఏళ్లలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఫీవర్ హాస్పిటల్ ఘన చరిత్ర కలిగినది. గతంలో సర్కార్ దవాఖానా కి రావాలంటే భయపడే వాళ్ళు. ప్రస్తుతం సర్కార్ దవాఖానాలకి జనం వస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బస్తి దవాఖాన లో ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతై ఐదు కోట్ల రూపాయల తో భవనాలు నిర్మించుకోవడం సంతోషంగా ఉంది. ఓ పి భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. బ్లడ్ బ్యాంక్ కూడా నిర్మించాలి. పాత భవనాల ను కూలిచి వేసి కొత్తగా నిర్మించాలి. ఫీవర్ హాస్పిటల్ కోసం ఒక మాస్టర్ ప్లాన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మేయర్ బొంతు రామ్మోహన్, నల్లకుంట కార్పొరేటర్ గరికంటి శ్రీదేవి, డీఎంఈ రమేష్ రెడ్డి, ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు

Related Posts