వరంగల్, మార్చి 8,
తెలంగాణలో మరో మంత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మహిళా శిశు సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు కోవిడ్ సోకినట్లు తేలింది. జ్వరంతో బాధపడుతున్న ఆమెలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో.. ఆమె కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ అని తేలింది. మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న సత్యవతి.. ఆ తర్వాత యశోదా హాస్పిటల్‌లో చేరినట్లు తెలుస్తోందివరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆమె ములుగులో పర్యటించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ఆయన పక్కనే నిలబడి ప్రసంగించారు. తాజాగా మంత్రికి కోవిడ్ సోకినట్లు తేలడంతో.. ఆమెను కలిసిన టీఆర్ఎస్ నేతలు టెన్షన్‌కు గురవుతున్నారు.తెలంగాణలో ఇప్పటికే భారీ సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో కోవిడ్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3 లక్షల మార్క్‌ను దాటింది.