YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

.కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా గ్రామ స్వరాజ్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు,ఉత్తమ పంచాయతీ లకు అవార్డులు అందజేసిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి

.కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా గ్రామ స్వరాజ్యం: మంత్రి జూపల్లి కృష్ణారావు,ఉత్తమ పంచాయతీ లకు అవార్డులు అందజేసిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి

పంచాయతీ రాజ్ చట్టం ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాదిద్దామని...దేశానికే ఆదర్శంగా తెలంగాణ గ్రామాలను మారుద్దామని పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా వికారాబాద్ లో స్థానిక సంస్థల ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తో కలిసి మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ఉత్తమ పంచాయతీ లకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...సంఘటితంగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని... గ్రామాల అభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు. కొత్త పంచాయతి రాజ్ చట్టం ద్వారా సర్పంచుకు, పాలకవర్గానికి పూర్తి అధికారాలు, నిధులు ఇస్తున్నామన్నారు. అయిన బాధ్యతలు సరిగా నిర్వహించకపోతే మాత్రం చర్యలు తప్పవన్నారు. మే 31 నాటికి అన్ని గ్రామాలకు, డిసెంబర్ నాటికి ఇంటింటికి భగీరథ నీరు సరఫరా జరుగుతుందన్నారు. దాంతో పాలక వర్గాలపై మంచి నీటి సరఫరా భారం పోతుందన్నారు. కొత్త చట్టం ద్వారా ప్రతి నెల పాలకవర్గ సమావేశం...రెండు నెలలకోసారి గ్రామ సభ విధిగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అలాగే నర్సరీ ల ఏర్పాటుతో పాటు, హరిత హారం పూర్తి బాధ్యత గ్రామ పంచాయతీలకే ఈ చట్టం ద్వారా అప్పగించడం జరిగిందన్నారు. కొత్త చట్టం ద్వారా గ్రామాల రూపు రేఖలు మారుతాయనే ఆశాభావాన్ని మంత్రి జూపల్లి వ్యక్తం చేశారు. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. అలాగే మండలాలు, గ్రామాలను కొత్తగా ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలన ప్రజల ముంగిట్లోకి చేరిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సంజీవరావు, రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. *కోల్ కుందాలో గ్రామ సభ* జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్బంగా వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలంలోని కోల్ కుందా గ్రామంలో జరిగిన గ్రామ సభలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు పాల్గొన్నారు. గ్రామంలో జరుతున్న ఉపాధి పనులను పరిశీలించి, కూలీలతో ముచ్చటించారు. ప్రతి ఒక్క కూలికి 100 రోజుల పని కల్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉపాధి పనుల ద్వారా కూలీలకు ఉపాదితో పాటు...గ్రామాలను అభివృద్ధి చేసుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

Related Posts