YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

చానాళ్ల తర్వాత కోట

చానాళ్ల తర్వాత కోట

హైదరాబాద్, మార్చి 9, 
 కొన్నాళ్లుగా వెండి దూరం పెట్టిన నటుడు కోటా శ్రీనివాసరావు. వయసైపోయిందనో.. లేదంటే ఆయన సినిమాలకు పనిరారనో.. ఏదైనా కోటా శ్రీనివాసరా రావు గారు కొన్నాళ్లుగా సినిమాల్లో కనిపించడం తగ్గింది. గతంలో వందల సినిమాల్లో కామెడీ పండించి.. చాలా సినిమాల్లో విలన్ గా పెరఫార్మ్ చేసి అద్భుతమైన పేరు తెచ్చుకున్న విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు.. ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చెయ్యాల్సిన పరిస్థితి. గతంలో జనతా గ్యారేజ్ సినిమా విషయంలో మోహన్ లాల్ ఎంతో బాగా చేసారు.. ఎన్టీఆర్ పెదనాన్న గా మోహన్ లాల్ నటన అద్భుతం అన్నవారికి కోట క్లాస్ పీకారు. తెలుగులోనూ అద్భుతమైన నటులు ఉన్నారు. కానీ వాళ్ళని పక్కనబెట్టేసి పర భాషా నటుల కోసం ఎదురు చూస్తున్నారంటూ అప్పట్లోనే కొంతమంది దర్శకులకు ఇండైరెక్ట్ గా చురకలు వేశారు కోటా.ఒకప్పుడు 20 గంటలు పని చేసిన కోటా ఇప్పుడు ఖాళీగా కూర్చోవడం నచ్చడం లేదంటున్నారు. కానీ తనకి వయసైపోయింది అని, తన ఆరోగ్యం బాగోలేదని తనకి అవకాశాలు ఇవ్వడం లేదని, కానీ తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా అని, మోకాళ్ళ నొప్పులు తప్ప తనకెలాంటి ఇబ్బందులు లేవంటున్న కోట శ్రీనివాసరా రావు లాక్ డౌన్ టైం లో ఖాళీగా కూర్చిపోలేకపోయా అని, లాక్ డౌన్ ముగిసాక కూడా ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదంటూ వాపోతున్నారు. అదే విషయాన్ని మీడియా ముఖంగా చెబుతున్నారు కూడా. తనకి డబ్బు, పారితోషకాలు ముఖ్యం కాదని వేషాలు ముఖ్యమంటున్నాడాయన. అందుకే మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో పాటుగా వి. వి .వినాయక్, త్రివిక్రమ్ లాంటి దర్శకులకు ఫోన్ చేసి అవకాశాల కోసం అడిగా అని చెబుతున్నారాయన.అయితే రీసెంట్ గా కోట గారు పవన్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న PSPK 27 లో నటిస్తున్నట్లు చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్‌తో నటించడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.

Related Posts