తిరుపతి మార్చి 9,
ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాలు కూడా కొనసాగలేరని, ఆపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మాజీ కేంద్రమంత్రి, చింతా మోహన్ జోస్యం చెప్పారు.
తిరుపతిలో ఆయన మాట్లాడుతూ దుగ్గరాజ పట్నం పోర్టుకు కేంద్రం అన్ని అనుమతులు, నిధులు 2012లొనే కేటాయించాయని తెలిపారు. చంద్రబాబు అసమర్థత, బంధుప్రీతి కారణంగా ఈ ప్రాజెక్టు నీరుగార్చారని ఆరోపించారు. వైకాపా దౌర్జన్యాల పార్టీగా మారిందన్నారు. పోలీసులు అధికారులు తమ విధులను వదిలి అధికారపార్టీ నాయకులకు దాసోహం అయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులందరు శ్రీలక్ష్మీని గుర్తుంచుకోవాలని సూచించారు. వైకాపా అధినేత కేవలం ఇద్దరి చేతుల్లో కీలుబొమ్మగా మారారని, దీనిపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, మంత్రుల్లో అసంతృప్తి నెలకొందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పూర్తికాలం పదవిలో కొనసాగలేరని అన్నారు. పార్టీలో తిరుగుబాటు వస్తుందని తెలిపారు.