YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

దినకరన్ పార్టీతో ఎంఐఎం పొత్తు

దినకరన్ పార్టీతో ఎంఐఎం పొత్తు

హైదరాబాద్ మార్చి 9, 
తమిళనాడు లో మూడు స్థానాల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేస్తుంది. దినకరన్ పార్టీ తో పొత్తు పెట్టుకుని బరిలో ఉంటున్నాం. చెన్నై 12 న వీఎంసీ లో సభ ఏర్పాటు చేస్తున్నానని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. తమిళ నాడు ప్రజల పై దినకరన్  పార్టీ అంటే నమ్మకం ఉంది. డీఎంకే తో విభేదం ఉందా లేదా అనేది 12 న జరిగే సభలో పూర్తి వివరాలు చెప్తామని అన్నారు. గతం లో 4. నుంచి 5 స్థానాల్లో భరిలో ఉన్నాం. ప్రస్తుతం మూడు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. 25 అసెంబ్లీ స్థానాల్లో మా పార్టీకి మంచి స్పదన ఉంది. దినకరన్ తో చర్చల అనంతరం మూడు స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యామని అన్నారు. నిర్మల్ జిల్లా భైంసా లో జరిగిన అల్లర్ల పై అసద్ మాట్లడుతూ భైంసా అల్లర్ల పై ప్రభుత్వం కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నా.  తెలంగాణ సర్కార్ కి మా విన్నపం.. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకోకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రం లో శాంతి భద్రతల పరిరక్షణ అవసరం. అది ఏ ప్రాంతం అయిన ఏ రాష్ట్రం అయిన అందరూ కలిసి మెలసి వుండాలి. అందరూ సుఖ సంతోషాలతో వుండాలి. మజ్లిస్ పార్టీ పై తనపై కొంత మంది బురదజల్లే ప్రయత్నం చేస్తూనే వున్నారని అన్నారు. పేద ముస్లిం లను కాపడుకుంటాం. వుమ్మడి అదిలాబాద్ ప్రాంతాలపై పోలీస్ పర్యవేక్షణ వుండాలని గతం నుండి మేము చెప్తూనే వున్నాం. భైంసా లోనే ఒక్కచోట ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయి. తెలంగాణ  అంతటా లా అండ్ ఆర్డర్ బాగానే వుంది కదా అని అయన వ్యాఖ్యానించారు.

Related Posts