YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేదు: మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేదు: మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ మార్చ్ 9 
కొత్త‌గా ఏర్ప‌డ్డ‌ తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేదు అని రాష్‌ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. న‌గ‌గ‌రంలోని ప‌ల్ల‌వి ఇన్‌స్టిట్యూట్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి సుర‌భి వాణిదేవీకి మ‌ద్ద‌తుగా ఏర్పాటు చేసిన‌ ప్ర‌యివేటు కాలేజేస్ అండ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అండ్ స్టాఫ్ వేల్ఫేర్ అసోసియేష‌న్ స‌మావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. విభ‌జ‌న‌ చ‌ట్టంలోని సంస్థ‌ల‌ను కూడా తెలంగాణ‌కు ఇవ్వ‌లేదు. రాష్ర్ట ప్ర‌భుత్వం ప‌న్నుల రూపంలో కేంద్రానికి రూ. 2 ల‌క్ష‌ల 72 వేల కోట్లు క‌డితే.. కేంద్రం మాత్రం రాష్ర్టానికి చ్చింది రూ. ల‌క్షా 40 వేల కోట్లు మాత్ర‌మే అని స్ప‌ష్టం చేశారు.తెలంగాణ రాష్ర్టం ఏర్ప‌డిన త‌ర్వాత హైద‌రాబాద్ ఎంతో అభివృద్ధి చెందింద‌న్నారు. తెలంగాణ కంటే ముందు ఏర్ప‌డిన మూడు రాష్ర్టాలు ఇంకా సెటిల్ కాలేదు. తెలంగాణ ఏర్ప‌డిన 6 నెల‌ల్లోనే అనేక స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాం. మౌలిక అంశాల‌ను ప‌రిష్క‌రించుకున్నాం. విద్యుత్ స‌మ‌స్య‌ను అధిగ‌మించాం. తాగు, సాగునీటి క‌ష్టాల‌కు ఇబ్బందులు లేకుండా చేశామ‌న్నారు.గ‌డిచిన ఆరున్న‌ర సంవ‌త్స‌రాలుగా విద్యారంగంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ముఖ్య‌మైన మార్పులు తీసుకువ‌చ్చింది. 2014కు ముందు 248 గురుకుల పాఠ‌శాల‌లు ఉంటే.. కొత్త‌గా 647 గురుకుల పాఠ‌శాల‌లు ఏర్పాటు చేశామ‌న్నారు. గురుకులాల్లో 4 ల‌క్ష‌ల 32 వేల మంది విద్యార్థులు చ‌దువుకుంటున్నారు. ఒక్కో విద్యార్థి మీద ల‌క్షా 20 వేలు ఖ‌ర్చు పెడుతున్నామ‌ని తెలిపారు. విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్‌రను అందిస్తూ.. నీట్‌, జేఈఈతో పాటు ఇత‌ర ప్ర‌వేశ ప‌రీక్ష‌ల్లో మంచి ర్యాంకులు సాధిస్తున్నార‌ని తెలిపారు. కేవ‌లం స్కూల్స్ మాత్ర‌మే కాకుండా.. ఆపై త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు కూడా స్కాల‌ర్‌షిప్స్ అందిస్తున్నామ‌ని చెప్పారు. గ‌త 6 సంవ‌త్స‌రాల్లో రూ. 12 వేల 800 కోట్లు విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ అందించింద‌న్నారు. భార‌త‌దేశంలో ఎక్క‌డా లేని విధంగా అంబేడ్క‌ర్, జ్యోతిబాపులే, వివేకానంద ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్ పేరిట విదేశాల్లో చ‌దువుకోవాల‌నుకునే విద్యార్థుల‌కు ఆర్థిక సాయం అందిస్తున్నామ‌ని తెలిపారు.

Related Posts