కర్నూలు జిల్లా టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ మూడో వర్గానికి ప్లస్ కానుందా... అంటే ఔననే సమాధానమే వస్తోంది. నిత్యం ఏదో ఒక రగడ తెరమీదికి వస్తూనే ఉంది. ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబం ధించి ఆధిపత్య పోరు రోజు రోజుకూ ముదిరి పాకాన పడుతోంది. ఏవీకి, అఖిలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు ఈ వివాదాలు చినుకు చినుకు గాలివానగా మారినట్టు.. ముదిరిపోయాయి. దీంతో ఇప్పుడు ఆళ్లగడ్డలో రెండు గ్రూపులు ఏర్పడి పోయాయి. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టిక్కెట్ తనదే అని ఏవి సవాల్ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం తన సొత్తే అన్నట్టుగా ప్రస్తుత మంత్రి అఖిల ప్రియ భావిస్తున్నారు. ఇక్కడ తన కుటుంబమే పాగా వేయాలని, వేరే వారెవరూ కన్నెత్తి కూడా చూడకూడదనే రేంజ్‌లో ఆమె రాజకీయాలు చేస్తున్నారు.టీడీపీలో చిర కాలంగా ఉండి, ముఖ్యంగా దివంగత నేత భూమా నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా మెలిగిన ఏవీ సుబ్బారెడ్డి కూడా ఆళ్లగడ్డపై ఆశలు పెంచుకున్నారు.ఈ రెండు గ్రూపులకు తోడుగా ఇప్పుడు తాజాగా మరో గ్రూపు కూడా రెడీ అయింది. ఆళ్లగడ్డకు గతంలో టీడీపీ ఇంచార్జ్‌గా పనిచేసిన ఇరిగెల రాంపుల్లారెడ్డి తాజాగా తెరమీదికి వచ్చాడు. మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలు పార్టీపై ప్రభావం చూపుతున్నాయన్నారు. వీరిద్దరు తమ వ్యక్తిగత ఇమేజ్‌లను కాపాడుకోవడానికి పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి వచ్చారని అన్నారు.ఈ విషయాన్నింటిని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లానన్నారు. సీఎం చెప్పాడంటూ వీరిద్దరు పోటాపోటీగా నిరాహార దీక్షలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరిస్తున్నార న్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్ కూడా రాదన్నారు. వీరిద్దరి సమస్య పరిష్కరించాలన్నారు. ఇందు కోసం జిల్లా ఇన్‌చార్జి మంత్రి లేక జిల్లా అధ్యక్షుడు జోక్యం చేసుకొని పరిష్కరించాలని కోరారు. మొత్తంగా ఇరిగెల తాజా వ్యవహారంతో ఆళ్లగడ్డలో మరో గ్రూపు రెడీ అయిందని తెలుస్తోంది. ఇరిగెల 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో ఆయనకు కూడా మంచి పట్టు ఉంది. మరి రాబోయే ఎన్నికల నాటికి ఈయన కూడా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగితే పరిస్థితి కష్టమేనని అంటున్నారు స్థానిక పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి టీడీపీలో సీనియర్ నేతకావడంతో చంద్రబాబు వద్ద కూడా పలుకుబడి ఉంది. నిజానికి పార్టీని బలోపేతం చేసింది కూడా ఏవీ వర్గమేనని చెబుతారు. భూమాకు అత్యంత ఆప్తుడైన ఏవీ ఆయన మరణం వరకు ఆయన చెప్పినట్టే నడుచుకున్నాడు. భూమా రాజకీయ చరిత్రలో భూమా తెరమీద కనిపించే హీరో అయితే తెరవెనక కనపడని డైరెక్టర్ ఏవీనే అన్నది అందరికి తెలసిందే. అయితే, భూమా మరణం తర్వాత ఏవీ తన రాజకీయాలు మొదలు పెట్టారు. తనకు కూడా టీడీపీలో ప్రాధాన్యం దక్కాలని కోరుకున్నాడు. అయితే, అప్పటికి రంగంలోకి దిగిన అఖిల ప్రియ.. ఏవీని రాజకీయంగా పక్కన పెడుతూవచ్చారు.. ఇదే ఈ ఇరువురి మధ్య తీవ్ర వివాదాన్ని రాజేసింది. ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అఖిల ఎవ్వరినీ లెక్కచేయకుండా తన ఫ్యామిలీ మొత్తాన్ని రంగంలోకి దింపి.. తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకున్నారు.అదే సమయంలో నంద్యాలలోనూ ఇదే తరహా రాజకీయాలు జరుగుతున్నాయి. ఆళ్లగడ్డను అమ్మలాగా, నంద్యాలను తండ్రిలాగా భావిస్తున్నానని ఆమె పదే పదే చెప్పుకొచ్చారు కూడా.