YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఏఐఎస్ఎంకే తోపాటు ఇండియన్ జననాయక కట్చిపార్టీ తో కమల హసన్ పొత్తు

ఏఐఎస్ఎంకే తోపాటు ఇండియన్ జననాయక కట్చిపార్టీ తో కమల హసన్ పొత్తు

చెన్నయ్ మార్చ్ 9 తమిళనాట త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. తమిళ పులులు జయలలిత కరుణానిధి లేకుండా జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడం.. ఇదే అవకాశంగా పాగావేయాలని బీజేపీ ప్రయత్నిస్తుండడంతో.. తమిళ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి.తొలిసారి ఎన్నికలను ఎదుర్కోబోతున్న లోకనాయకుడు కమల్ హాసన్.. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. ఒంటరిగా బరిలో దిగితే ఇబ్బందులు తప్పవని గుర్తించిన కమల్.. పొత్తులతో కుంభస్థలాన్ని కొట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు మరో నటుడు శరత్ కుమార్ కు చెందిన ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చి (ఏఐఎస్ఎంకే) తోపాటు ఇండియన్ జననాయక కట్చి (ఐజేకే) పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు.ఈ మేరకు మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందాన్ని వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 234 స్థానాల్లో 154 చోట్ల కమల్ ఎంఎన్ఎం పోటీ చేయనుంది. మిగిలిన 80 స్థానాల్లో ఐజేకే ఏఐఎస్ఎంకే చెరో 40 చోట్ల బరిలో నిలవనున్నాయి.
ఈ మేరకు కుదుర్చుకున్న అగ్రిమెంట్ పై మూడు పార్టీల నేతలు సంతకాలు కూడా చేశారు. తమిళ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని తమిళ ప్రతిష్టను పునరుద్ధరించడానికే తాము ఒక్కటయ్యామని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. కాగా.. ఈ కూటమిలోకి మరికొన్ని పార్టీలను కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

Related Posts