YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అన్నాడీఎంకేకు షాక్

అన్నాడీఎంకేకు షాక్

చెన్నై, మార్చి 9, 
తమిళనాడు ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి భారీ షాక్ తగిలింది. కూటమి నుంచి బయటకు వస్తున్నట్టు నటుడు విజయ్‌కాంత్ నేతృత్వంలోనిడీఎండీకే మంగళవారం ప్రకటించింది. సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీఎండీకే తెలిపింది. మూడు దఫాలుగా చర్చలు జరిపినా తాము కోరిన సీట్లను ఇవ్వడానికి అన్నాడీఎంకే ఒప్పుకోలేదని పేర్కొంది. అన్నాడీఎంకే కూటమితో కలిసి వెళ్లాలని డీఎండీకే నిర్ణయించినా, అనుకున్న సీట్లను ఇవ్వడానికి అధికార పార్టీ నిరాకరించింది.2016 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత వెంటే విజయకాంత్ నడిచారు. అన్నాడీఎంకే, డీఎండీకే కలసి పోటీ చేశాయి. ఎన్నికల తర్వాత మళ్లీ విడిపోయాయి. అయితే, తిరిగి 2019 లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో చేరారు. ఆ ఎన్నికల్లో డీఎండీకే నాలుగు స్థానాల్లో పోటీచేసింది. చివరి నిమిషంలో విజయ్ కాంత్‌ చేరినా సీట్లు సర్దుబాటు చేశారు. అయితే, ఈ కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒక్క స్థానంలో విజయం సాధించింది.ఇక, 2014 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని మొత్తం 39 ఎంపీ స్థానాలకుగానూ అన్నాడీఎంకే 37 చోట్ల గెలుపొందింది. ఒక్క స్థానంలో పోటీచేసిన విజయ్ కాంత్ పార్టీ డీఎండీకే ఓటమిపాలయ్యింది. కేవలం 5.1 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. మొత్తం 234 సీట్లకుగానూ మిత్రపక్షాలు బీజేపీకి 20, పీఎంకేకి 23 సీట్లను అన్నాడీఎంకే ఇప్పటికే కేటాయించింది.వాస్తవానికి తొలుత తమకు 41 స్థానాలు కావాలని డీఎండీకే పట్టుబట్టింది. తర్వాత 25 సీట్లుకు దిగివచ్చి చివరిగా 23 సీట్లు ఇవ్వాలని కోరింది. అయితే, దీనికి అన్నాడీఎంకే ససేమిరా అనడంతో కూటమి నుంచి బయటకు వచ్చింది. ఈ సందర్భంగా తమకు ముందుగానే దీపావళి వచ్చిందని, అన్నాడీఎంకే కూటమి అన్ని నియోజకవర్గాల్లో మూల్యం చెల్లించుకుంటుందని డీఎండీకే సెక్రెటరీ ఎల్ సుదీష్ వ్యాఖ్యానించారు.

Related Posts