YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ప్రధానికి జగన్ లేఖ

ప్రధానికి జగన్ లేఖ

విజయవాడ, మార్చి 9, 
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచించాలని.. తాను స్వయంగా కలిసి పరిస్థితిని వివరించేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. తనతో పాటూ అఖిలపక్ష నేతలు, కార్మిక సంఘాల నాయకుల్ని ఢిల్లీకి తీసుకొస్తానని లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్లాంట్ ప్రైవేటీకరణను నాలుగు ప్రత్యామ్నాయాలను జగన్ సూచించారు. ఏపీ ముఖ్యమంత్రి రాసిన లేఖపై ప్రధాని ఎలా స్పందిస్తాన్నది ఆసక్తికరంగా మారింది.విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారు. లోక్‌సభలో విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఎలాంటి ఈక్విటీ షేర్లు లేవన్నారు. పరిశ్రమలో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు చెప్పారు. ప్లాంట్‌ను మొత్తం ప్రైవేటుపరం చేయబోతున్నట్లు ప్రకటించారు. మెరుగైన ఉత్పాదకత కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నామన్నారు.విశాఖ ఉక్కుపై కేంద్రం తాజా ప్రకటనతో కార్మికులు, నిర్వాసితులు భగ్గుమన్నారు. సోమవారం రాత్రి నుంచి ఆందోళనలు తీవ్రతరం చేశారు.. కార్మికుల ఆందోళనతో పరిస్థితులు మారిపోయాయి. సోమవారం రాత్రి నుంచి కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన నిరసన కొనసాగుతూనే ఉంది. కేంద్రం ప్రకటనతో ఉన్న ప్రతులను దగ్దం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా మంగళవారం విశాఖలోని ఉక్కుపరిపాలనా భవనం ముట్టడించారు. కార్మికుల ఆందోళనలకు పార్టీలు, మిగిలిన కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయి. కేంద్రం ప్రకటనను వెనక్కు తీసుకునే వరకు వెనక్కు తగ్గేది లేదంటున్నారు. దీంతో సీఎం జగన్ స్పందించి ప్రధానికి లేఖ రాశారు.

Related Posts