YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

భగ్గుమన్న విశాఖ

భగ్గుమన్న విశాఖ

విశాఖపట్టణం, మార్చి 9, 
విశాఖ ఉక్కుపై కేంద్రం తాజా ప్రకటనతో కార్మికులు, నిర్వాసితులు భగ్గుమన్నారు. సోమవారం రాత్రి నుంచి ఆందోళనలు తీవ్రతరం చేశారు.. కార్మికుల ఆందోళనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలి ఉక్కు ప్రధాన ద్వారం వద్ద ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కార్మికులంతా మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. బస్సుల్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు.. దూరప్రాంతం వెళ్లే బస్సులు వెళ్లేందుకు మాత్రమే అంగీకరించారు. కార్మికులు రాత్రంతా రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు.సోమవారం రాత్రి నుంచి కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన నిరసన కొనసాగుతూనే ఉంది. కేంద్రం ప్రకటనతో ఉన్న ప్రతులను దగ్దం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా మంగళవారం విశాఖలోని ఉక్కుపరిపాలనా భవనం ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనలకు పార్టీలు, మిగిలిన కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయి. కేంద్రం ప్రకటనను వెనక్కు తీసుకునే వరకు వెనక్కు తగ్గేది లేదంటున్నారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని స్టీల్‌ సిటీ భగ్గుమంటోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది. కేంద్రం ప్రకటనతో సాగర తీరం అట్టుడికిపోతోంది. ఎటు చూసినా ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కారు. రాత్రి నుంచి స్టీల్‌ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ధర్నాలు, రాస్తారోకోలతో రహదారులను దిగ్బంధించారు. కూర్మన్నపాలెం స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చ్‌ దగ్గర ఆందోళనలకు దిగారు. పోలీసులు చర్చలు జరిపినా..వెనక్కి తగ్గడం లేదు ఉద్యమకారులు. ఉక్కు పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్నారు.పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి మొండిచెయ్యి చూపింది కేంద్రం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు సోమవారం పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇచ్చిన సమాధానంతో విశాఖలోని ఉక్కు కార్మికులు, నిర్వాసితులు ఒక్కసారిగా భగ్గుమంటున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో పాటు రామాయపట్నం పోర్టు విషయంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు నిరాశే మిగిల్చింది. ఇవాళ స్టీల్‌ ప్లాంట్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఎందరో త్యాగాల ఫలితంగా సాధించిన ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామంటున్నారు.అటు, జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం జంక్షన్‌ స్టీల్‌ ప్లాంట్‌ మేయిన్‌ గేట్‌ దగ్గర ఉక్కు ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. కార్మికులంతా మానవహారంతో రహదారిని దిగ్బంధించారు. కూర్మన్నపాలెం కూడలిలో ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్రం ప్రకటన ప్రతులను దగ్దం చేశారు. కేంద్రం తీరుకు నిరసనగా ఇవాళ విశాఖలోని స్టీల్ ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీస్‌ ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఇదిలావుంటే, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఉక్కు ఉద్యమానికి అజ్యం పోసినట్లైంది. విశాఖ ఉక్కు పరిశ్రమలో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్న ఆమె తేల్చిచెప్పారు. తద్వారా ప్లాంట్‌ను మొత్తంగా ప్రైవేటుపరం చేయబోతున్నట్లు ప్రకటించారు. మెరుగైన ఉత్పాదకత కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. స్టీల్‌ప్లాంట్‌ అమ్మకంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామన్నారు.విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారు. లోక్‌సభలో విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఎలాంటి ఈక్విటీ షేర్లు లేవని స్పష్టం చేశారు.విశాఖ ఉక్కు పరిశ్రమలో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తున్న ఆమె తేల్చిచెప్పారు. తద్వారా ప్లాంట్‌ను మొత్తంగా ప్రైవేటుపరం చేయబోతున్నట్లు ప్రకటించారు. మెరుగైన ఉత్పాదకత కోసమే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పెంపు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. స్టీల్‌ప్లాంట్‌ అమ్మకంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామన్నారు.

Related Posts