జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ప్రకటన
సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్బంగా జిల్లాలో పోలింగ్ జరిగే పట్టణ ప్రాంతాల్లో ఈ నెల 10న సెలవు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నేగోషబిల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 మేరకు.. పోలింగ్ జరిగే తేదీ 10.03.2021 (బుధవారం) ఆయా పోలింగ్ పరిసరాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు, స్థానిక సంస్థలు, కార్యాలయాలకు లోకల్ హోలిడేగా ప్రకటించడమైనదన్నారు.
అలాగే అన్ని పబ్లిక్, ప్రయివేటు, ఫర్మ్ లు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటికి కూడా లోకల్ హాలిడే ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఈ అంశాన్ని సంబందిత అధికారులు తూచా తప్పక అమలయ్యేలా చర్యలు చేపట్టి.. ఓటింగ్ ప్రక్రియను శాంతియుత, ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.