YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు - ఎన్నికలకు పటిష్ట భద్రత

కర్నూలు  - ఎన్నికలకు పటిష్ట భద్రత

మున్సిపల్ ఎన్నికలకు రెండు వేల మంది పోలీసులతో  పటిష్ట భద్రత ఏర్పాటు చేసామని జిల్లా  ఎస్పీ డాక్టర్ ఫక్కిరప్ప వెల్లడించారు. ప్రశాంతంగా మున్సిపాలిటి ఎన్నికలను నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమని అయన అన్నారు. ఓటర్లు తమ  ఓటు  హక్కును నిర్భయంగా , స్వేచ్ఛగా  వినియోగించుకునేలా భద్రత ఏర్పాట్లు చేశాం. జిల్లా వ్యాప్తంగా 9 (1 కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ , 7 మున్సిపాలిటిలు, 1 నగర పంచాయితీ) మున్సిపాలిటిలకు గాను, 225 వార్డులలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రజలు స్వేచ్ఛాయుతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాల  పై ప్రత్యేక దృష్టి సారించాం. పోలీసు బలగాలతో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.  ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు  అప్రమత్తంగా ఉండి పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం. మార్చి 14 వ తేది ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, సభలు, ఊరేగింపులు, డప్పులు, బాణ సంచా కాల్చడం నిషేధం అమలు లో వుంటుంది. జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లు, గత ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడిన వారిని, నేర చరిత్ర గల వారిపై  మొత్తం  21,540  మందిని బైండోవర్ చేసి 2,347  కేసులు నమోదు చేశామన్నారు.  మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుండి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, ఫ్లయిండ్ స్క్వాడ్స్ తో ముమ్మరంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేసి 123 కేసులు నమోదు చేసి 116 మందిని అరెస్టు చేసాం.  సీజ్ చేసినవి... నగదు 1 కోటి 88 లక్షల 72 వేలు,  నాటుసారా 987 లీటర్లు,  మద్యం  3,476  లీటర్లు ,  12  పోర్ వీలర్స్,  8  త్రీ వీలర్స్,  31  టూ వీలర్స్ స్వాధీనం. శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా పట్టిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని అయన అన్నారు.

Related Posts